మళ్లీ హ్యాకయిన యూనివర్సిటీ వెబ్సైట్
జాదవ్పూర్ యూనివర్సిటీ వెబ్సైట్ మళ్లీ హ్యాకింగ్కు గురైంది. ఆ సైట్ను ఎవరైనా క్లిక్ చేస్తే.. నేరుగా ఓ బూతు సైట్లోకి లింకు వెళ్లిపోతోంది. అంతేతప్ప అందులో అడ్మిషన్లు, ఇతర సమాచారం ఎక్కడా కనిపించడంలేదు. అయితే.. ఈ సమస్యను తక్కువ సమయంలోనే అధిగమించారు. పోలీసులకు కూడా ఈ విషయం తెలిపామని, రెండోసారి తమ సైట్ హ్యాకింగ్కు గురి కావడంతో దానికి బాధ్యులు ఎవరన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నామని యూనివర్సిటీ రిజిస్ట్రార్ పీకే ఘోష్ తెలిపారు.
గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో నాటి వైస్ ఛాన్స్లర్ అభిజిత్ చక్రవర్తిని తొలగించాలని భారీ స్థాయిలో ఉద్యమం జరిగినప్పుడు ఇలాగే సైట్ ఓసారి హ్యాకింగ్కు గురైంది. అప్పట్లో ఏకంగా వైస్ ఛాన్స్లర్ పేజీయే హ్యాకింగ్కు గురై.. దాన్ని క్లిక్ చేసినప్పుడు 'సారీ' అనే సందేశం కనపడేది. నాటి అల్లర్లలో పోలసీఉలు లాఠీ ఛార్జిచేయడంతో చాలామంది విద్యార్థులు ఆస్పత్రుల పాలయ్యారు. గత సంవత్సరం ఆగస్టు నెలలో ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వీసీపై ఆరోపణలు వచ్చాయి.