సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. గురువారం ఉదయం నాటికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5734కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 5,095 యాక్టివ్ కేసులు ఉండగా.. 473 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 166 మంది మృతి చెందారు. ఇక జార్ఖండ్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. ఈ మహమ్మారి బారిన పడి గురువారం 75 ఏళ్ల వృద్ధుడు మరణించినట్లు జార్ఖండ్ ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 4 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇక మహారాష్ట్రలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు(1135) కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా 72కు చేరింది. పంజాబ్‌లో తాజాగా మరో 8 కరోనా పాజిటివ్ కేసులు, ఒక మరణం నమోదైంది. దీంతో ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 114కు చేరగా, 10 మంది మృతి చెందారు. కొత్తగా రాజస్తాన్‌లో 30, మధ్యప్రదేశ్‌లో 6, పశ్చిమ బెంగాల్‌లో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment