బిడెన్‌కు ప్రెసిడెన్షియల్ మెడల్
ప్రదానం చేసిన అధ్యక్షుడు ఒబామా
వాషింగ్టన్: బిడెన్‌ను అధ్యక్షుడు ఒబామా.. అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ‘ది ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం’తో శ్వేతసౌధంలో సత్కరించారు. బిడెనే అమెరికాకు ఇప్పటి వరకు ఉత్తమ ఉపాధ్యక్షుడు అని, దేశ చరిత్రలో ఆయన సింహం అని ఒబామా కొనియాడారు. ప్రాంతీయ ఘర్షణలను సాకుగా చూపి పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు అణ్వాయుధాల వినియోగ ప్రమాదాన్ని సూచిస్తోందని ఈ సందర్భంగా బిడెన్ అన్నారు. ‘ఉత్తర కొరియా ఒక్కటే కాదు. రష్యా, పాక్, పలు దేశాలు తీసుకుంటున్న చర్యలు యూరప్, దక్షిణాసియా, తూర్పు ఆసియాల్లో నెలకొంటున్న ప్రాంతీయ ఘర్షణల్లో అణ్వాయుధాల వినియోగానికి సిద్ధమనే సంకేతాలను పంపిస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకర ఆలోచన.’ అని బిడెన్ సూచించారు.
ఉగ్రవాదాన్ని తొలగించండి
అమెరికా కొత్త రక్షణ మంత్రిగా బాధ్యతలు తీసుకోనున్న జేమ్స్ మాటిస్.. పాక్‌కు కఠినమైన హెచ్చరికలు పంపించారు. పాకిస్తాన్.. తన భూభాగంపై పాతుకుపోయిన ఉగ్రవాదాన్ని బయటకు పంపించటం లేదా నిర్మూలించటంపై దృష్టిపెట్టాల్సిందేనని మాటిస్ అన్నారు.