దీర్ఘకాల కేసులే అసలైన సవాల్: సీజేఐ | Justice TS Thakur comments on Legal system | Sakshi
Sakshi News home page

దీర్ఘకాల కేసులే అసలైన సవాల్: సీజేఐ

Published Sun, Sep 18 2016 7:01 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

దీర్ఘకాల కేసులే అసలైన సవాల్: సీజేఐ - Sakshi

దీర్ఘకాల కేసులే అసలైన సవాల్: సీజేఐ

అహ్మదాబాద్: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించడమే న్యాయ వ్యవస్థ ముందున్న అసలైన సవాలు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ అన్నారు. గుజరాత్ జ్యుడీషియల్ అకాడెమీని శనివారం ఆయన ప్రారంభించి ప్రసంగించారు. తాను పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా  ఉన్నప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ లోక్ అదాలత్‌లు నిర్వహించడం ద్వారా 14 లక్షల కేసుల్ని పరిష్కరించానని ఆయన తెలిపారు.

అయితే చిన్న కేసుల్ని పరిష్కరించడమంటే చీపురు చేతబట్టి.. ఇంటిలో ఉన్న చెత్తాచెదారాన్ని ఊడ్చటంలాంటిదేనన్న భావన కలిగిందని, దీర్ఘకాలంగా కోర్టుల్లో మూలుగుతున్న కేసులను పరిష్కరించడంలోనే అసలైన సవాలు దాగుందన్న విషయం అవగతమైందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement