కమల్ వర్సెస్ జయలలిత
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రముఖ నటుడు కమల్ హాసన్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. చెన్నైలో వరదల బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని, మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోయిందని కమల్ హాసన్ ఆరోపించగా జయలలిత ఆర్థికమంత్రి ఓ పన్నీర్ సెల్వం ఆ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. కొందరు వ్యక్తుల రాజకీయ మైలేజీ కోసం కమల్ ఓ పప్పెట్గా మారాడని గట్టిగా వ్యాఖ్యానించారు.
వరద బాధితులను ఆదుకునే విషయంలో వారికి ఆర్థిక పరమైన తోడ్పాటునిచ్చే విషయంలో జయ సర్కారు విఫలమైందని, తనతో సహా ఎంతో మొత్తంగా కడుతున్న పన్నులన్నీ ఏమయ్యాయని, 'నాకోసం నా ప్రజలకోసం ఏం చేశారు అని కమల్ ప్రశ్నించగా.. ప్రభుత్వం మాత్రం వ్యగ్యంగా స్పందించింది. ప్రకృతి విపత్తులనేవి కేవలం ఒక పాట, ఒక డ్యాన్స్తో సర్దుమణిగిపోయేవి కావని స్వల్పంగా జయ కమల్ కు చురకలు అంటించారు.