తుపాకీతో నిజం గొంతుకను నొక్కేశారు: కమల్‌ | kamal Haasan Tweet on Gauri Lankesh Murder | Sakshi
Sakshi News home page

తుపాకీతో నిజం గొంతుకను నొక్కేశారు: కమల్‌

Published Thu, Sep 7 2017 11:51 AM | Last Updated on Sun, Sep 17 2017 6:32 PM

తుపాకీతో నిజం గొంతుకను నొక్కేశారు: కమల్‌

తుపాకీతో నిజం గొంతుకను నొక్కేశారు: కమల్‌

సాక్షి, చెన్నై: రాజకీయాలపై స్పష్టమైన సంకేతాలు ఇవ్వకుండా అభిమానుల్లో గందరగోళం నెలకొల్పుతున్నారు లోక నాయకుడు కమల్‌ హాసన్. అయితే ప్రముఖ అంశాలపై మాత్రం నిత్యం తన ట్విట్టర్ లో స్పందిస్తూనే వస్తున్నారు. నీట్ వివాదం-అనిత సూసైడ్‌పై ట్వీట్లు చేసిన కమల్‌.. ఇప్పుడు ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య ఉదంతంపై స్పందించారు. 
 
‘‘చర్చలో ఓడిపోతామన్న భయంతో తుపాకీతో నిజం గొంతుకను చంపేశారు. ఇంతకన్నా దారుణం మరోకటి లేదు. గౌరీ లంకేశ్‌ మరణంపై ఆమె కుటుంబ సభ్యులకు, మద్ధతుదారులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అంటూ కమల్‌ ఈ ఉదయం ఓ ట్వీట్ చేశారు.
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement