Kamal Haasan Tweet
-
Kamal Haasan: రెండేళ్ల తర్వాత సెట్స్‌లో అడుగుపెట్టిన కమల్.. ఫోటోలు వైరల్
కమల్ హాసన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఇండియన్ 2’. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ సేనాపతి పాత్రలో కనిపించనున్నారు. కొన్నేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించగా సెట్స్‌లో అగ్నిప్రమాదం సంభవించడం, ఆ ఆతర్వాత కోర్టు కేసులతో దాదాపు రెండేళ్ల పాటు షూటింగ్ నిలిచిపోయింది. ప్రస్తుతం ఇండియన్ 2 షూటింగ్ తిరిగి ప్రారంభం కావడంతో కమల్ హాసన్ సెట్స్‌లో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను కమల్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. (చదవండి: Rakul Preet Singh: ‘ఇండియన్ 2’ సెట్లో అడుగుపెట్టిన రకుల్) ఈ ఫోటోల్లో దర్శకుడు శంకర్, కమల్ చర్చించుకుంటున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత కమల్ సెట్స్‌లో అడుగు పెట్టడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కమల్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా కోసం అందాల భామ హార్స్ రైడింగ్ కూడా నేర్చుకుంటోంది. ఈ చిత్రంలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, బాబీ సింహా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండేళ్ల క్రితం సెట్స్‌లో అగ్నిప్రమాదం సంభవించి ముగ్గురు సిబ్బంది మృతి చెందడంతో షూటింగ్ నిలిపేశారు. #Indian2 from today. @Udhaystalin @shankarshanmugh @LycaProductions @RedGiantMovies_ pic.twitter.com/TsI4LR6caE — Kamal Haasan (@ikamalhaasan) September 22, 2022 -
యెడ్డీ ఓటమి.. శుభ సందర్భం కోసం ఎదురు చూస్తున్నా: కమల్
సాక్షి, చైన్నై: దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన కర్ణాటక ఎన్నికలకు ఎట్టకేలకు శుభం కార్డు పడింది. 104 స్థానాలతో మెజారిటీ పార్టీగా అవతరించినా బీజేపీకి భంగపాటు తప్పలేదు. అధికార ఏర్పాటుకు తగిన ఎమ్మెల్యేలు లేకపోవడంతో యడ్యూరప్ప బల పరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు అన్నీ బెడిసికొట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో, బల నిరూపణ కంటే ముందే యడ్యూరప్ప శనివారం సాయంత్రం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో కాంగ్రెస్- జేడీఎస్ కూటమి తరపున కుమారస్వామి ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కుమారస్వామికి అభినందనలు తెలిపారు. తాజాగా తమిళ సినీనటుడు కమల్ హాసన్ కన్నడ రాజకీయాలపై స్పందించారు. కుమారస్వామికి ట్విటర్లో శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రజాస్వామ్య విజయానికి స్వాగతం. కొత్త ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపేందుకు గర్విస్తున్నా. ఈ శుభ సందర్భం కోసం ఎదురు చూస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు. -
రాహుల్‌కి కమల్ స్పెషల్ ట్వీట్
కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌గాంధీకి అభినందనల వెల్లువ మొదలైంది. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా రాహుల్‌కు పలువురు కీలక నేతలు, కార్యకర్తల శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. ముఖ్యంగా సినీ రంగంనుంచి మొదటిసారిగా నటుడు కమల్ హాసన్ రాహుల్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇప్పటికే రాజకీయాలపై పలు కీలక వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న కమల్ కాంగ్రెస్ అధ్యక్షుడికి విషెస్ తెలపడం ఆసక్తికరంగా మారింది. రాహుల్‌కు అభినందనలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నాయకులంటే తనకు ఎనలేని గౌరవమని. ఆ గౌరవాన్ని రాహుల్ గాంధీ తప్పక నిలబెడతారనే విశ్వసాన్ని కమల్ వ్యక్తం చేశారు. రాహుల్ జీ మీకు శుభాకాంక్షలు. మీ పదవి మిమ్మల్ని నిర్దేశించలేదు. కానీ.. మీరే మీ బాధ్యతలను, స్థానాన్ని నిర్వచించగలరు.. మీ పెద్దలంటే నాకు ఎంతో అభిమానం.. మీరు కూడా నా ప్రశంసలు పొందేలా పని చేస్తారనే నమ్మకం నాకు ఉంది.. అంతటి సామర్ధ్యం మీ భుజాలకుందంటూ కమల్ ట్వీట్ చేశారు. Congratulations Mr. Rahul.G. Your seat does not define you but you can define your position. I have admired your elders. I am sure you would work and deserve my admiration too. All the strength to your shoulders. — Kamal Haasan (@ikamalhaasan) December 16, 2017 -
అంతకుముందే గెలిచి తీరుతా..
తమిళసినిమా: మరణానికి ముందే గెలిచి తీరుతా అని నటుడు కమలహాసన్ ట్వీట్ చేశారు. నటుడు కమలహాసన్ ఫొటోను ఒక పిల్లాడు కత్తితో పొడిచి చించుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అందులో ఆ పిల్లాడు కమలహాసన్పై బూతు పంచాంగం కూడా ప్రయోగించారు. దీనిపై కమల్ స్పందిస్తూ ఒక పసివాడి చేతిలో చావడమే మేలు అని ట్విట్టర్లో పేర్కొన్నారు. అయితే తన సహోదరుడిలాంటి అతను తనను చంపి నేరస్తుడవడం తమిళ జాతి సహించదన్నారు. ఇక ప్రకృతి తనను చంపే తీరుతుందని, ఆ సంతోషాన్ని పొందే హక్కు మీకూ ఉంటుందన్నారు. అంతకు ముందే తాను గెలిచే తీరుతానని కమల్ పేర్కొన్నారు. హిందు తీవ్రవాదం యువత చేతిలో కత్తి పట్టిస్తోందని, కమలహాసన్ మీరు చెప్పిందే నిజం అని ఓ యువకుడు చేసిన ట్వీట్‌ను కమల్ తన ట్విట్టర్లో ప్రస్తావించారు. ఇలాఉండగా తమిళనాడు రైతు సంఘం ఆధ్వర్యంలో 5 లక్షల మంది రైతులు ఈ నెల 20వ తేదీన ఢిల్లీలో పోరాటానికి సిద్ధం అవుతున్నారు. వారికి మద్దతు తెలుపుతున్నట్లు కమల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. అఖిల భారత రైతులందరూ కలిసి ధిల్లీలో పోరాటానికి సిద్ధం కావడం సంతోషంగా ఉంది. ఈ పోరాటంలో చేరడానికి ఇది సరైన సమయంగా ఆయన పేర్కొన్నారు. -
తుపాకీతో నిజం గొంతుకను నొక్కేశారు: కమల్
సాక్షి, చెన్నై: రాజకీయాలపై స్పష్టమైన సంకేతాలు ఇవ్వకుండా అభిమానుల్లో గందరగోళం నెలకొల్పుతున్నారు లోక నాయకుడు కమల్ హాసన్. అయితే ప్రముఖ అంశాలపై మాత్రం నిత్యం తన ట్విట్టర్ లో స్పందిస్తూనే వస్తున్నారు. నీట్ వివాదం-అనిత సూసైడ్‌పై ట్వీట్లు చేసిన కమల్.. ఇప్పుడు ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య ఉదంతంపై స్పందించారు. ‘‘చర్చలో ఓడిపోతామన్న భయంతో తుపాకీతో నిజం గొంతుకను చంపేశారు. ఇంతకన్నా దారుణం మరోకటి లేదు. గౌరీ లంకేశ్ మరణంపై ఆమె కుటుంబ సభ్యులకు, మద్ధతుదారులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అంటూ కమల్ ఈ ఉదయం ఓ ట్వీట్ చేశారు. Silencing a voice with a gun is the worst way to win a debate. Condolence to all those who are grieving Gauri Lankesh's demise. — Kamal Haasan (@ikamalhaasan) September 7, 2017 'లంకేశ్ పత్రికే' అనే కన్నడ వీక్లీ టాబ్లాయిడ్‌ను ఆమె నడిపిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి మోటర్ బైక్ పై వచ్చిన దుండగులు ఆమెను కాల్చి హత్య చేసి పారిపోయారు. ఆమె హత్య వెనుక బీజేపీ, ఆరెస్సెస్ నేతల హస్తం ఉందంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించగా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆ ఆరోపణలను తిప్పి కొట్టారు. అయితే ఆమె సోదరుడు మాత్రం మావోయిస్టుల హస్తం ఉండి ఉండొచ్చన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.