
తమిళసినిమా: మరణానికి ముందే గెలిచి తీరుతా అని నటుడు కమలహాసన్ ట్వీట్ చేశారు. నటుడు కమలహాసన్ ఫొటోను ఒక పిల్లాడు కత్తితో పొడిచి చించుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అందులో ఆ పిల్లాడు కమలహాసన్‌పై బూతు పంచాంగం కూడా ప్రయోగించారు. దీనిపై కమల్ స్పందిస్తూ ఒక పసివాడి చేతిలో చావడమే మేలు అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే తన సహోదరుడిలాంటి అతను తనను చంపి నేరస్తుడవడం తమిళ జాతి సహించదన్నారు.
ఇక ప్రకృతి తనను చంపే తీరుతుందని, ఆ సంతోషాన్ని పొందే హక్కు మీకూ ఉంటుందన్నారు. అంతకు ముందే తాను గెలిచే తీరుతానని కమల్ పేర్కొన్నారు. హిందు తీవ్రవాదం యువత చేతిలో కత్తి పట్టిస్తోందని, కమలహాసన్ మీరు చెప్పిందే నిజం అని ఓ యువకుడు చేసిన ట్వీట్‌ను కమల్ తన ట్విట్టర్‌లో ప్రస్తావించారు. ఇలాఉండగా తమిళనాడు రైతు సంఘం ఆధ్వర్యంలో 5 లక్షల మంది రైతులు ఈ నెల 20వ తేదీన ఢిల్లీలో పోరాటానికి సిద్ధం అవుతున్నారు. వారికి మద్దతు తెలుపుతున్నట్లు కమల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అఖిల భారత రైతులందరూ కలిసి ధిల్లీలో పోరాటానికి సిద్ధం కావడం సంతోషంగా ఉంది. ఈ పోరాటంలో చేరడానికి ఇది సరైన సమయంగా ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment