- ‘డిప్యూటీ’కే కీలక శాఖలు
- ప్రభుత్వ పనితీరుపై సీఎం పర్యవేక్షణ
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కేజ్రీవాల్ తన వద్ద ఏ మంత్రిత్వశాఖనూ ఉంచుకోరాదని నిర్ణయించుకున్నారు. ఒక సీఎం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. కేజ్రీవాల్ మొత్తం ప్రభుత్వ పనితీరును పర్యవేక్షిస్తారు. మొత్తం ఆరుగురు మంత్రుల్లో ఉపముఖ్యమంత్రి సిసోడియాకు కీలకమైన బాధ్యతలతో పాటు అత్యధిక విభాగాలను అప్పగించారు. ప్రమాణం అనంతరం కేజ్రీవాల్, ఆరుగురు మంత్రులు సిసోడియా, అసీమ్ అహ్మద్ ఖాన్, సందీప్ కుమార్, సత్యేందర్ జైన్, గోపాల్ రాయ్, జితేంద్ర సింగ్ తోమర్‌లు సచివాలయానికి వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలను సిసోడియా విలేకర్లకు తెలిపారు.
మంత్రులు- శాఖలు
అరవింద్ కేజ్రీవాల్: ముఖ్యమంత్రి
మనీశ్ సిసోడియా: ఆర్థిక, ప్రణాళిక శాఖ, రెవెన్యూ శాఖ, సేవలు, విద్యుత్, విద్య, ఉన్నత విద్య, సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక విద్య, పాలనా సంస్కరణలు, పట్టణాభివృద్ధి, భూములు, భవనాలు, విజిలెన్స్ విభాగాలతో పాటు.. ఎవరికీ కేటాయించని ఇతర విభాగాల బాధ్యతలు
గోపాల్‌రాయ్: ఉపాధికల్పన, అభివృద్ధి, కార్మిక, రవాణా, సాధారణ పాలనా విభాగం శాఖలు
సత్యేందర్ జైన్: విద్యుత్, ఆరోగ్యం, పరిశ్రమలు, గురుద్వారా నిర్వహణ, సాగునీరు, వరద నియంత్రణ, ప్రజాపనుల విభాగం
జితేంద్రసింగ్ తోమర్: హోంశాఖ, న్యాయశాఖ, పర్యాటకం, కళలు, సంస్కృతి
అసిం అహ్మద్‌ఖాన్: ఆహారం, సరఫరా, పర్యావరణం, అటవీ, ఎన్నికల శాఖలు
సందీప్‌కుమార్: మహిళా, శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం, భాష, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు