వధూవరులు సహా 15 మంది దుర్మరణం | Killed 15 people, including the bride and groom | Sakshi
Sakshi News home page

వధూవరులు సహా 15 మంది దుర్మరణం

Published Sat, May 2 2015 2:26 AM | Last Updated on Sun, Sep 3 2017 1:14 AM

వధూవరులు సహా 15 మంది దుర్మరణం

వధూవరులు సహా 15 మంది దుర్మరణం

అలీపూర్‌దౌర్: పెళ్లి సంబరంతో కళకళలాడుతున్న వధూవరులు సహా 15 మంది రోడ్డు ప్రమాదానికి బలయ్యారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లోని మదారిహాత్ జిల్లాలో శుక్రవారం ఈ విషాదం చోటుచేసుకుంది. పెళ్లి వేడుక తర్వాత బిర్పారా నుంచి పెళ్లి బృందంతో వస్తున్న వాహనం 31వ నంబరు జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది.

 

దీంతో పెళ్లికొడుకు, పెళ్లికూతురు, వాహనం డ్రైవర్, క్లీనర్ సహా 12 మంది అక్కడికక్కడే మృతిచెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురు సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ చనిపోయారు. మిగిలిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు లారీని, దాని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement