న్యూఢిల్లీ: తిరస్కరణకు గురైన దరఖాస్తులను సరిచేసుకునేందుకు సుమారు 70 వేల మంది అభ్యర్థులకు రైల్వే శాఖ మరో అవకాశం ఇచ్చింది. ఫొటోలు సరిగా అప్‌లోడ్ కాకపోవడం వల్ల జరిగిన దోషాలను సరిదిద్దుకోవడానికి మూడు రోజుల గడువు ఇస్తున్నట్లు రైల్వే శాఖ అధికారి తెలిపారు. అసిస్టెంట్ లోకో పైలట్లు, టెక్నీషియన్ల ఉద్యోగాల కోసం వచ్చిన 48 లక్షల దరఖాస్తుల్లో 1.27 లక్షల దరఖాస్తుల్లో ఫొటోలు సరిగా అప్‌లోడ్ కాలేదని గుర్తించారు. అందులో, 70 వేల మంది ఫొటోల్లో మార్పులు చేసుకుని మళ్లీ అప్‌లోడ్ చేయాలని అధికారులు సూచించారు. ఈ మేరకు సదరు అభ్యర్థులకు ఈమెయిల్స్ ద్వారా సమాచారం పంపారు. జూలై 18–20 మధ్య రైల్వే నియామక బోర్డు వెబ్‌సైట్‌లో ఈ తప్పులను సరిదిద్దుకోవాలని తెలిపారు. మిగిలిన 57 వేల దరఖాస్తుదారులను కూడా పరిశీలించామని, వాటిలో మార్పులు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment