ఫామ్హౌజ్లో కాళ్లు, చేతులు నరికేసి.. | Limbs Of 2 Men Cut Off Allegedly At Akali Dal Leader's Farmhouse in Punjab | Sakshi
Sakshi News home page

ఫామ్హౌజ్లో కాళ్లు, చేతులు నరికేసి..

Published Mon, Dec 14 2015 8:57 AM | Last Updated on Sun, Sep 3 2017 1:59 PM

ఫామ్హౌజ్లో కాళ్లు, చేతులు నరికేసి..

ఫామ్హౌజ్లో కాళ్లు, చేతులు నరికేసి..

చండీగఢ్: పంజాబ్లో దారుణ సంఘటన జరిగింది. ఫజిల్కా జిల్లాలోని అబోహర్లో అధికార అకాలీదళ్కు చెందిన ఓ నాయకుడి ఫామ్ హౌజ్లో ఇద్దరు వ్యక్తుల కాళ్లు చేతులు నరికేశారు. గత శనివారం జరిగిన ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. బంద్లు, ఆందోళనలతో అబోహర్ అట్టుడికిపోయింది. ఘర్షణలు జరగకుండా అదనపు బలగాలను మోహరించారు.

భీమ్ టంక్ అనే వ్యక్తి రెండు చేతులు, కాళ్లు నరికేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. గుర్జంత్ సింగ్ అనే మరో వ్యక్తి చేతిని నరికేశాడు. అమృత్సర్లో చికిత్స పొందుతున్న గుర్జంత్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. అకాలీదళ్ నేత శివలాల్ దోడా, ఆయన మేనల్లుడితో సహా మొత్తం 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement