న్యూఢిల్లీ: పాకిస్తాన్ భూభాగంలో ఉగ్ర స్థావరాలను సహించబోమని భారత్, అమెరికా స్పష్టం చేశాయి. పాక్‌ప్రభుత్వ స్థిరత్వానికి కూడా ముప్పుగా మారిన అలాంటి సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆ దేశానికి సూచించాయి. బుధవారం భారత పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ఉగ్రవాదం, వారి మౌలిక వసతులు, ఉగ్ర స్థావరాలను నిర్మూలించడం భారత్, అమెరికా ఉమ్మడి లక్ష్యాలన్నారు. భారత్–అమెరికా సంబంధాలు బలోపేతం కావడం కేవలం రెండు దేశాలకే ప్రయోజనకరం కాదని, అది మొత్తం ఆసియా, ప్రపంచ అభివృద్ధికి దోహదపడుతుందని మోదీ, టిల్లర్‌సన్ చెప్పారు. అంతకుముందు టిల్లర్‌సన్.. విదేశాంగ మంత్రి సుష్మతో భేటీ అయ్యారు. హెచ్–1బీ వీసా విధానాల్లో చేస్తున్న మార్పుల వల్ల భారత ఐటీ నిపుణుల ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడాలని సుష్మ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment