లాక్‌డౌన్ వల్ల కడుపు నిండా తినలేని వారి సంఖ్య పెరుగుతోంది. నాలుగు మెతుకులు సంపాదించేందుకు ఉన్న పని కూడా కోల్పోయిన వారి సంఖ్య అధికమవుతోంది. ప్రతీ నలుగురిలో ముగ్గురు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ఓ అధ్యయనం నిగ్గు తేల్చింది. దేశంలో వివిధ రంగాలకు చెందిన 67 శాతం మంది ఉపాధి కోల్పోయారని విస్తుపోయే విషయాలను వెల్లడించింది. అజీజ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ లాక్‌డౌన్ వల్ల వచ్చిన మార్పుచేర్పులపై అధ్యయనం చేసింది. ఏప్రిల్ 13 నుంచి మే 9 వరకు చేసిన సర్వేలో 12 రాష్ట్రాల్లోని 3970 మందిపై పరిశోధన చేసింది. దీని ఫలితాలను మంగళవారం వెల్లడించింది.
ఈ మేరకు డా. రోసా అబ్రహం మాట్లాడుతూ.. లాక్‌డౌన్.. ప్రజల పోషణ, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రభావం దీర్ఘకాలికంగా ఉండే అవకాశముందని హెచ్చరించింది. "ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి ఆదాయం లేకపోవడంతో సాధారణ జనం ఉన్నవాటితోనే బతుకు వెల్లదీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆహారాన్ని సాధారణ పరిమాణం కన్నా తక్కువ మోతాదులో తీసుకుంటున్నారు. ఇది దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా బాలికల్లో ఎక్కువ ఎఫెక్ట్ చూపుతుంది. 50 రోజుల లాక్‌డౌన్ ప్రజల జీవనాన్ని వెనక్కు నెట్టివేసింద"ని అంటూ విచారం వ్యక్తం చేసింది. (కరోనా : ట్విటర్ సంచలన నిర్ణయం)
సర్వే వెల్లడించిన మరిన్ని అంశాలు..
► ఇంట్లో ఉన్న సరుకులు నిండుకుండటంతో పేదవాళ్లు కడుపు మాడ్చుకుంటూ బతుకు వెల్లదీస్తున్నారు.
► అర్బన్ ప్రాంతాల్లో సుమారు 80 % మంది ఉద్యోగాలు కోల్పోతే, గ్రామీణ ప్రాంతాల్లో ఇది 58 శాతంగా ఉంది.
► ఇక లాక్‌డౌన్ పీరియడ్‌లో 43 నుంచి 57 శాతం మంది వలస కూలీలకు యజమానుల నుంచి చిల్లిగవ్వ అందలేదు.
► 90% మంది రైతులు తమ పంటను మద్దతు ధరకు అమ్మడం లేదు
► పట్టణాల్లో 43శాతం, గ్రామీణ ప్రాంతంలో 34 శాతం మంది అత్యావసరాల కోసం అప్పు తీసుకుంటున్నారు.
► నగరాల్లో 86% రూరల్ ప్రాంతాల్లో 54% వచ్చే నెల అద్దె చెల్లించే స్థితిలో లేరు.
► సానుకూల అంశమేమిటంటే 86% మంది జనాలు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. అయితే వారిలో సగాన్నికన్నా తక్కువ మందికి ప్రభుత్వ నగదు అందలేదు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 60 శాతానికి పైగా ప్రజలకు జన్‌ధన్ ఖాతాలు లేవు. (అటు సడలింపులు.. ఇటు వలసలు)
Comments
Please login to add a commentAdd a comment