మదన్ మిత్రా రాజీనామా
కోల్కతా: శారదా కుంభకోణం కేసులో నిందితుడు పశ్చిమ బెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత మదన్ మిత్రా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఈ కేసులో బెయిల్పై విడుదలైన ఆయన బుధవారం తన పదవికి రాజీనామా చేశారు.
మదన్ మిత్రాకు కిందిస్థాయి కోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో మరో రోజులో కోర్టు నిర్ణయం వెలువడనుండగా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.