సామ్నా తరహాలో సర్కారీ దినపత్రిక! | Madhya pradesh government to bring out daily on lines of Saamana | Sakshi
Sakshi News home page

సామ్నా తరహాలో సర్కారీ దినపత్రిక!

Published Mon, Jul 28 2014 1:58 PM | Last Updated on Sat, Sep 2 2017 11:01 AM

సామ్నా తరహాలో సర్కారీ దినపత్రిక!

సామ్నా తరహాలో సర్కారీ దినపత్రిక!

శివసేన అధికారిక పత్రిక సామ్నా తరహాలోనే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ దినపత్రికను ప్రారంభించనున్నట్లు అక్కడి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రాష్ట్రంలోని బీజేపీ ఎలక్షన్ సెల్ కార్యవర్గ సభ్యులకు, పార్టీ అధికారిక ప్రతినిధులకు, నిర్వాహక కార్యదర్శులకు ఇచ్చిన విందు సందర్భంగా ఆయనీ విషయం వెల్లడించారు.

ఈ పత్రిక సాయంతో నేరుగా ప్రజల వద్దకు వెళ్లే అవకాశం ఉంటుందని, అలాగే వివిధ అంశాలపై ప్రభుత్వం, పార్టీ ఏమనుకుంటున్నాయో స్పష్టంగా రాయచ్చని చౌహాన్ అన్నారు. బీజేపీకి అనుబంధంగా ఉన్న వాళ్లు ఈ పత్రికలో రాస్తారని, ఇది రాష్ట్రంలోని దాదాపు పది లక్షల మంది కార్యకర్తలకు వెళ్తుందని చెప్పారు.  ఈ సమావేశం దాదాపు మూడు గంటల పాటు సాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement