daily news paper
-
1947, ఆగస్టు 15 నాటి పలు దిన పత్రికల హెడ్ లైన్స్ ఇవే..
సాక్షి, వెబ్డెస్క్ : అఖండ భారతావనికి స్వాతంత్ర్యం సిద్ధించి రేపటితో 75 ఏళ్లు. ఈ 75 ఏళ్లుగా మనం అనువభవిస్తున్న ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు.. స్వాతంత్ర్య సమర యోధుల వందల ఏళ్ల పోరాట ఫలం. లాఠీ దెబ్బలు.. బుల్లెట్ గాయాలు.. రక్తపుటేర్లు.. బంధిఖానాలు.. బలిదానాలు రవి అస్తమించని బ్రిటీష్ పాలనలో నిత్య కృత్యాలు. కశ్మీర్లో అన్యాయం జరిగితే కన్యాకుమారిలోని ఇంట్లో కూర్చుని తెలుసుకోవాటానికి.. అక్కడి నుంచే ప్రశ్నించటానికి ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్ లాంటి జెట్ స్పీడ్ సోషల్ మీడియా లేని రోజులవి. టీవీలు, రేడియోలు ఉన్నా.. సామాన్య ప్రజలకు అందుబాటులో లేవవి. అలాంటి రోజుల్లో నిన్న ఏం జరిగిందో..రేపు ఏం జరగబోతోందో తెలుసుకోవటానికి.. జాతిని ఏకం చేయటానికి.. ఉద్యమ వీరులకు, సామాన్య ప్రజలకు వారధులుగా నిలవటానికి వార్తా దిన పత్రికలు ముఖ్య భూమిక పోషించాయి. ప్రజల్లో ఉద్యమ కాంక్షను రగిలించాయి. సుత్తి లేకుండా.. సూటిగా వార్తలను.. కాదు,కాదు సంఘటనలను జనాలకు అందించాయి. అలాంటి దినపత్రికలు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు ఉదయం ప్రజల్ని ఎలా పలకరించాయి.. ఏఏ శీర్షికలు పెట్టాయంటే.. 1947, ఆగస్టు 15న దేశ వ్యాప్తంగా ఉన్న పలు దినపత్రికల్లోని హెడ్డింగ్స్... ఫొటో క్రెడిట్: ఆంధ్రపత్రిక ఫొటో క్రెడిట్ : మలయాళ మనోరమ ఫొటో క్రెడిట్ : హిందుస్తాన్ ఫొటో క్రెడిట్ : గుజరాత్ సమాచార్ ఫొటో క్రెడిట్ : ఇండియన్ ఎక్స్ప్రెస్ ఫొటో క్రెడిట్ : హిందూస్తాన్ టైమ్స్ ఫొటో క్రెడిట్ : టైమ్స్ ఆఫ్ ఇండియా ఫొటో క్రెడిట్ : ది హిందూ కన్నడ పత్రిక ఫొటో క్రెడిట్ : ది ట్రిబ్యున్ -
‘మాతృభూమి’ వీరేంద్రకుమార్ మృతి
కోజికోడ్/వయనాడ్: రాజ్యసభ సభ్యుడు, మలయాళ దిన పత్రిక ‘మాతృభూమి’మేనేజింగ్ డైరెక్టర్ ఎం.పి. వీరేంద్ర కుమార్(83) గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన మృతికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనకు భార్య ఉష, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వయనాడ్ జిల్లా కల్పెట్టలో శుక్రవారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ)కు మూడు పర్యాయాలు చైర్మన్గా పనిచేసిన వీరేంద్రకుమార్ ప్రస్తుతం పీటీఐ బోర్డు డైరెక్టర్గా కొనసాగుతున్నారు. 2003–2004 కాలంలో ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి ప్రెసిడెంట్గా కూడా ఆయన వ్యవహరించారు. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికైన ‘హైమవతభువిల్’వంటి 15కు పైగా పుస్తకాలను వీరేంద్ర రచించారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన ఆయన 1987లో ఈకే నయనార్ మంత్రి వర్గంలో విద్యుత్ మంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలోని అడవుల్లో చెట్ల నరికివేతపై నిషేధం విధిస్తూ తొలి ఉత్తర్వులు జారీ చేశారు. అవి వివాదమవడంతో రాజీనామా చేశారు. కోజికోడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్నికై ఐకే గుజ్రాల్, హెచ్డీ దేవెగౌడ కేబినెట్లలో బాధ్యతలు నిర్వహించారు. -
‘సాక్షి’కి అంతర్జాతీయ గుర్తింపు
-
‘సాక్షి’కి అంతర్జాతీయ గుర్తింపు
⇒ ప్రచురణలో ఉన్నత ప్రమాణాలకు దక్కిన గౌరవం ⇒ ఇంటర్నేషనల్ కలర్క్వాలిటీ క్లబ్లో సభ్యత్వం ⇒ ప్రపంచవ్యాప్తంగా పోటీపడిన 128 పత్రికలు ⇒ 65పత్రికలకు దక్కిన మెంబర్షిప్ ⇒ ఈ ఖ్యాతి దక్కించుకున్న తొలి తెలుగు పత్రిక ‘సాక్షి’ సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: తెలుగువారి మనస్సాక్షి ‘సాక్షి’ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి. రాశిలో వాసిలో ఉన్నతప్రమాణాలను పాటిస్తున్న సాక్షి దినపత్రికకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇంటర్నేషనల్ న్యూస్పేపర్ కలర్క్వాలిటీ క్లబ్ (ఐఎన్సీక్యుసి)లో ‘సాక్షి’కి సభ్యత్వం లభించింది. ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి తెలుగుపత్రిక ‘సాక్షి’ కావడం విశేషం. ప్రింటింగ్లో అంతర్జాతీయస్థాయి నాణ్యతా ప్రమాణాలను క్రమం తప్పకుండా పాటించే వార్తాపత్రికలు, ప్రచురణా సంస్థల మధ్య పోటీ నిర్వహించి ఈ సభ్యత్వానికి ఎంపికచేస్తారు. కొల్కతాలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో వరల్డ్ ప్రింటర్స్ ఫోరమ్, వాన్ ఇఫ్రా (జర్మనీ) డిప్యూటీ సీఈవో మన్ఫ్రెడ్ వెర్ఫెల్ చేతులు మీదుగా ‘సాక్షి’ ప్రతినిధులు ఈ సభ్యత్వ ధృవపత్రాన్ని అందుకున్నారు. వాన్ ఇఫ్రా ఇండియా 24వ వార్షిక సమావేశాల సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో అనేక అంతర్జాతీయ పత్రికల ప్రతినిధులు, వివిధ దేశాలకు చెందిన పలువురు మీడియా ప్రముఖులు పాల్గొన్నారు. 65 పత్రికలకు సభ్యత్వం ప్రపంచవ్యాప్తంగా 128 పత్రికలు ఈ సభ్యత్వం కోసం పోటీపడ్డాయి. ఐఎన్సీక్యుసీ అంతర్జాతీయంగా ప్రింటింగ్లో ఉన్నతప్రమాణాలను పాటిస్తున్న పత్రికల మధ్య ప్రతి రెండేళ్లకొకమారు పోటీ నిర్వహించి తమ సంస్థలో సభ్యత్వం ఇస్తుంది. రెండేళ్ల (2016-2018) కాలానికి గాను ఈసారి 65 పత్రికలు ఎంపికయ్యాయి. ప్రింటింగ్ క్వాలిటీని నిరూపించుకోవడం కోసం ఈ పోటీలో పాల్గొనే పత్రికలు ఎన్నో కఠిన పరీక్షలను ఎదుర్కొనవలసి ఉంటుంది. అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన మీడియా నిపుణులతో కూడిన జ్యూరీ ఈ ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తుంది. 1994లో ప్రారంభమైన ఐఎన్సీక్యుసి అప్పటి నుంచి వార్తాపత్రికలు, ప్రచురణ సంస్థల మధ్య ‘కలర్ ప్రింటింగ్ క్వాలిటీ’ పోటీలు నిర్వహిస్తూ వస్తోంది. క్వాలిటీ ప్రింటింగ్లో ప్రపంచస్థాయి గుర్తింపు కోసం వార్తాపత్రికలు, ప్రచురణ సంస్థలు ఈ పోటీలో పాల్గొంటాయి. కొల్కతాలో జరిగిన సభ్యత్వ ప్రదానం కార్యక్రమంలో సాక్షి తరఫున పి.వి.కె.ప్రసాద్ (డెరైక్టర్, ఆపరేషన్స్), టి.కె.సురేష్ (సీజీఎం, ఆపరేషన్స్), బి.గౌరీశంకర్ (జీఎం, క్వాలిటీ అండ్ ప్రీప్రెస్) పాల్గొన్నారు. -
సామ్నా తరహాలో సర్కారీ దినపత్రిక!
శివసేన అధికారిక పత్రిక సామ్నా తరహాలోనే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ దినపత్రికను ప్రారంభించనున్నట్లు అక్కడి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రాష్ట్రంలోని బీజేపీ ఎలక్షన్ సెల్ కార్యవర్గ సభ్యులకు, పార్టీ అధికారిక ప్రతినిధులకు, నిర్వాహక కార్యదర్శులకు ఇచ్చిన విందు సందర్భంగా ఆయనీ విషయం వెల్లడించారు. ఈ పత్రిక సాయంతో నేరుగా ప్రజల వద్దకు వెళ్లే అవకాశం ఉంటుందని, అలాగే వివిధ అంశాలపై ప్రభుత్వం, పార్టీ ఏమనుకుంటున్నాయో స్పష్టంగా రాయచ్చని చౌహాన్ అన్నారు. బీజేపీకి అనుబంధంగా ఉన్న వాళ్లు ఈ పత్రికలో రాస్తారని, ఇది రాష్ట్రంలోని దాదాపు పది లక్షల మంది కార్యకర్తలకు వెళ్తుందని చెప్పారు. ఈ సమావేశం దాదాపు మూడు గంటల పాటు సాగింది.