భోపాల్ : మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. దీంతో కుటుంబసభ్యులు ఆయనను లక్నోలోని మెదంటా హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్నట్లు భోపాల్‌లోని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. ఊపిరితిత్తులు, మూత్రపిండాలతో పాటు కాలేయం సరిగా పనిచేయకపోవడంతో లాల్జీ ఆరోగ్యం మరింత విషమంగా మారిందని మెదంటా హాస్పిటల్ డాక్టర్ రాకేశ్ కపూర్ తెలిపారు. లాల్జీ ఆరోగ్యం విషమంగా ఉందని ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు.
10 రోజుల పాటు స్వస్థలంలో గడిపేందుకు జూన్ 9న లక్నోకు లాల్జీ టాండన్ వెళ్లారు. తీవ్ర అనారోగ్యంతో జూన్ 11న లక్నోలోని మెదంటా ఆస్పత్రిలో చేరారు. వెంటిలేటర్‌పై చికిత్స అందించగా కొన్ని రోజుల క్రితమే లాల్జీ ఆరోగ్యం మెరుగుపడి డిశ్చార్జ్ అయ్యారు. మరోసారి ఆయన ఆరోగ్యం విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాల్జీ టాండన్ ఆరోగ్యం క్షీణించడంతో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్‌కు అదనంగా మధ్యప్రదేశ్ గవర్నర్ బాధ్యతలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అప్పగించిన సంగతి తెలిసిందే.
(లాక్‌డౌన్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు)
Comments
Please login to add a commentAdd a comment