భోపాల్: సాధారణంగా మనం ఒక్క పామును చూస్తేనే దడుసుకుని చస్తాం. అలాంటిది ఇంట్లో.. దాదాపు 100కు పైగా నాగుపాములు ఉంటే ఆ ఇంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఓ సారి ఊహించుకొండి. తలుచుకుంటేనే గుండేల్లో ఒణుకు వచ్చేస్తుంది కదా. ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు మధ్యప్రదేశ్ రాన్ గ్రామానికి చెందిన జీవన్ సింగ్ కుశ్వాన్ కుటుంబ సభ్యులు. రాత్రి అయ్యిందంటే చాలు ఒకటే పాము బుసల శబ్దం. దాంతో ఇంట్లో ఉండలేక వేరే ఊరు వెళ్లి పోయారు. అయితే ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవడం కోసం జీవన్ మాత్రం ఇంట్లోనే ఉన్నాడు. రాత్రి కాగానే ఆరుబయట కూర్చుని గమనించసాగాడు. ఆ సమయంలో పదుల సంఖ్యలో పాము పిల్లలు బయటకు వచ్చి ఇళ్లంతా పాకడం ప్రారంభించాయి.
విషయం అర్థమయిన జీవన్ ఫారెస్ట్ అధికారుల దగ్గరకి వెళ్లి తన సమస్య గురించి చెప్పుకున్నాడు. ప్రస్తుతం వారు పాముల స్థావరం ఎక్కడ ఉందో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా జీవన్ మాట్లాడుతూ.. ‘ఇంట్లో పాములు.. బయట కరోనా. ఎక్కడికి వెళ్లాలో మాకు అర్థం కావడం లేదు. పాముల భయంతో వారం రోజులుగా మా ఇంట్లో ఎవ్వరికి నిద్రే లేదు’ అంటున్నాడు జీవన్.
Comments
Please login to add a commentAdd a comment