cobras
-
విష సర్పాల వ్యాపారం గుట్టురట్టు.. 26 నాగుపాములు స్వాధీనం
భువనేశ్వర్: బాలాసోర్ జిల్లా బలియాపాల్ తహసీల్ పంచుపాలి ప్రాంతంలో విష సర్పాల అక్రమ వ్యాపారం చేస్తున్న ముఠా గుట్టురట్టు అయ్యింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా అనుబంధ వర్గాలు చేపట్టిన దాడిలో ఈ ముఠా వ్యవహారం బట్టబయలైంది. అటవీ శాఖ అధికారులు ఆకస్మికంగా చేపట్టిన దాడుల్లో బుధవారం 26 నాగుపాములను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ఒక మహిళ ఉన్నట్లు తెలిపారు. బాలాసోర్ జిల్లా లంగేశ్వర్ అటవీ కార్యాలయానికి సమీపంలో ని ఈ అక్రమ వ్యాపార శిబిరం కొనసాగడం సంచలనం రేపింది. బాలాసోర్ అటవీ విభాగం మరియు స్నేక్ హెల్ప్‌లైన్ వర్గాలు ఉమ్మడిగా ఈ శిబిరంపై దాడి చేశాయి. పట్టుబడిన ముఠాలో ఉన్న దంపతు లు అంతర్ రాష్ట్ర రాకెట్‌ను నడుపుతున్నట్లు తేలింది. పలు ప్రాంతాలకు తరలింపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పాములను సేకరించి వాటి విషాన్ని తీసి వివిధ ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు స్నేక్ హెల్ప్‌లైన్ కార్యదర్శి సువేందు మల్లిక్ మీడియాతో మాట్లాడారు. నాగుపాముల అక్రమ వ్యాపారం (స్మగ్లింగ్) గురించి విశ్వసనీయ సమాచారం అందిందన్నారు. సమాచారం అందడంతో తక్షణమే భువనేశ్వర్ నుంచి తెల్లవారు జామున 3 గంటలకు బయల్దేరి విష సర్పాల అక్రమ వ్యాపార శిబిరానికి చేరినట్లు వివరించారు. విషయం స్థానిక అటవీ శాఖ అధికారులకు తెలియజేయడంతో వారు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారన్నారు. వీరి ఆధ్వర్యంలో జరిగిన దాడిలో 26 నాగుపాములకు స్వేచ్ఛ కల్పించి నట్లు పేర్కొన్నారు. పాములను రంధ్రాలతో ప్ర త్యేకంగా రూపొందించిన ప్లాస్టిక్ కంటైనర్లలో అక్రమార్కులు బందీచేసి ఉంచినట్లు దృష్టికి వచ్చిందన్నారు. ఈ వ్యవహారంలో మరింత మంది వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు తెలిపా రు. దర్యాప్తు కొనసాగుతోందని బాలాసోర్ అటవీ విభాగం ఏసీఎఫ్ శోభన్ చాంద్ వెల్లడించారు. -
రెండు నాగుపాములు ఆడుతూ...
-
ఇంట్లో నాగన్న.. బయట కరోనా
భోపాల్: సాధారణంగా మనం ఒక్క పామును చూస్తేనే దడుసుకుని చస్తాం. అలాంటిది ఇంట్లో.. దాదాపు 100కు పైగా నాగుపాములు ఉంటే ఆ ఇంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఓ సారి ఊహించుకొండి. తలుచుకుంటేనే గుండేల్లో ఒణుకు వచ్చేస్తుంది కదా. ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు మధ్యప్రదేశ్ రాన్ గ్రామానికి చెందిన జీవన్ సింగ్ కుశ్వాన్ కుటుంబ సభ్యులు. రాత్రి అయ్యిందంటే చాలు ఒకటే పాము బుసల శబ్దం. దాంతో ఇంట్లో ఉండలేక వేరే ఊరు వెళ్లి పోయారు. అయితే ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవడం కోసం జీవన్ మాత్రం ఇంట్లోనే ఉన్నాడు. రాత్రి కాగానే ఆరుబయట కూర్చుని గమనించసాగాడు. ఆ సమయంలో పదుల సంఖ్యలో పాము పిల్లలు బయటకు వచ్చి ఇళ్లంతా పాకడం ప్రారంభించాయి. విషయం అర్థమయిన జీవన్ ఫారెస్ట్ అధికారుల దగ్గరకి వెళ్లి తన సమస్య గురించి చెప్పుకున్నాడు. ప్రస్తుతం వారు పాముల స్థావరం ఎక్కడ ఉందో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా జీవన్ మాట్లాడుతూ.. ‘ఇంట్లో పాములు.. బయట కరోనా. ఎక్కడికి వెళ్లాలో మాకు అర్థం కావడం లేదు. పాముల భయంతో వారం రోజులుగా మా ఇంట్లో ఎవ్వరికి నిద్రే లేదు’ అంటున్నాడు జీవన్. -
ఆసుపత్రిలో పాములు.. పరుగో పరుగు..
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాగుపాములు డాక్టర్లను, పేషంట్లను పరుగు పెట్టించాయి. పట్టణంలోని మిట్టూరులో ఉన్నప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఓపీ విభాగంలోకి ఉదయం ఓపీ సెంటర్ తెరిచి వైద్యులు సేవలు ప్రారంభించారు.. ఇంతలోనే రోగుల మధ్యలోంచి రెండు నాగుపాములు లోపలికి వచ్చాయి. వీటిని గమనించిన డాక్టర్లు, సిబ్బంది పరుగందుకున్నారు. సిబ్బంది పాములు పట్టే వారికి కబురు చేశారు. పాములు పట్టేవారు రెండు పాములను తీసుకు వెళ్లినా.. రోగులు భయంతో బిక్కు బిక్కు మంటున్నారు. ఈ ఘటనతో పక్కనే ఉన్న ఇన్ పేషంట్ విభాగంలో తలుపులు, కిటికీలు మూసేశారు.