ఆసుపత్రిలో పాములు.. పరుగో పరుగు..
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాగుపాములు డాక్టర్లను, పేషంట్లను పరుగు పెట్టించాయి. పట్టణంలోని మిట్టూరులో ఉన్నప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఓపీ విభాగంలోకి ఉదయం ఓపీ సెంటర్ తెరిచి వైద్యులు సేవలు ప్రారంభించారు.. ఇంతలోనే రోగుల మధ్యలోంచి రెండు నాగుపాములు లోపలికి వచ్చాయి. వీటిని గమనించిన డాక్టర్లు, సిబ్బంది పరుగందుకున్నారు. సిబ్బంది పాములు పట్టే వారికి కబురు చేశారు. పాములు పట్టేవారు రెండు పాములను తీసుకు వెళ్లినా.. రోగులు భయంతో బిక్కు బిక్కు మంటున్నారు. ఈ ఘటనతో పక్కనే ఉన్న ఇన్ పేషంట్ విభాగంలో తలుపులు, కిటికీలు మూసేశారు.