మహారాష్ట్ర గవర్నర్ రాజీనామా
మిజోరం గవర్నర్‌గా బదిలీ చేయడంపై నిరసన
ముంబై: మహారాష్ట్ర గవర్నర్ కె.శంకర్‌నారాయణన్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి పంపించారు. కేంద్ర ప్రభుత్వం మిజోరం గవర్నర్‌గా పంపించాలని నిర్ణయించడంతో ఆయన పై నిర్ణయం తీసుకున్నారు. మిజోరంకు వెళ్లడం సాధ్యం కాదని, ఇకపై క్రియాశీల రాజకీయాల్లో పాల్గొంటానని కాంగ్రెస్‌కు చెందిన 82 ఏళ్ల సీనియర్ నేత శంకర్‌నారాయణన్ వెల్లడించారు. తాను బీజేపీ సహా అన్ని పార్టీలతో సఖ్యతగానే ఉన్నానని, ఇతర గవర్నర్లలా రాజకీయాలు చేయలేదని రాజ్‌భవన్‌లో మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. దీన్ని రాజకీయ కక్షసాధింపులా భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు.. అది మీడియానే నిర్ణయించాలన్నారు. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గవర్నర్ పదవికి రాజీనామా చేయాలంటూ హోం శాఖ నుంచి సూచనలు అందిన గవర్నర్లలో శంకర్‌నారాయణన్ ఒకరు. రాజీనామా చేయకపోవడంతో శనివారం ఆయనపై బదిలీ వేటు వేశారు. ఆయన రాజీనామాతో గుజరాత్ గవర్నర్ ఓపీ కోహ్లీ మహారాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు.
రెండు నెలల్లో నలుగురు..గవర్నర్ల నియామకాల విషయంలో మోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం చేస్తోన్న రాజకీయాలకు నిదర్శనంగా నిలిచే దృష్టాంతమిది. మిజోరం గవర్నర్‌గా శంకర్ నారాయణన్ వె ళ్లుంటే ఆ రాష్ట్రం రెండు నెలలలోపే నలుగురు గవర్నర్లను చూసిన రాష్ట్రంగా గుర్తింపు పొందేది. జూలై 6న అప్పటిగవర్నర్‌పురుషోత్తమన్‌ను నాగాలాండ్‌కు బదిలీ చేశారు. గుజరాత్ గవర్నర్‌గా ఉన్న కమల బేణీవాల్‌ను మిజోరంకు గవర్నర్‌గా పంపించారు. నెలరోజుల్లోపే ఆమెనూ తొలగించి, మణిపూర్ గవర్నరైన వి.దుగ్గల్‌కు అదనంగా మిజోరం బాధ్యతలు అప్పగించారు. తాజాగా దుగ్గలో స్థానంలో నారాయణన్‌ను బదిలీ చేశారు.