![మలాలాకు అమెరికా లిబర్టీ మెడల్](/styles/webp/s3/article_images/2017/09/2/81414013061_625x300.jpg.webp?itok=tGMSy75-)
మలాలాకు అమెరికా లిబర్టీ మెడల్
వాషింగ్టన్: పాకిస్థాన్‌కు చెందిన బాలికా విద్య హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలా యూసఫ్‌జాయ్(17) ఈ ఏడాదికిగానూ అమెరికా లిబర్టీ మెడల్‌ను గెలుచుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడే వ్యక్తులకు ఏటా ఈ అవార్డును అందిస్తారు.
అమెరికా రాజ్యాంగం అమల్లోకి వచ్చి 200 ఏళ్లు పూర్తయినందుకు సూచికగా 1988లో నేషనల్ కాన్‌స్టిట్యూషన్ సెంటర్ ఈ అవార్డును ఏర్పాటు చేసింది. మంగళవారం పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడెల్ఫియాలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో మలాలా ఈ మెడల్‌ను అందుకుంది.