ఉప ఎన్నికలో 16 శాతం పోలింగ్
Published Wed, Apr 12 2017 12:37 PM | Last Updated on Tue, Sep 5 2017 8:36 AM
హైదరాబాద్: కేరళ రాష్ట్రంలోని మలప్పురం లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఉదయం 9 గంటల వరకు 16 శాతం పోలింగ్ నమోదైంది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లు ఫిర్యాదులు లేవని, కొన్నిచోట్ల ఈవీఎంలు తప్పుగా పనిచేయడంతో వాటిని సరిచేశామని అధికారులు తెలిపారు. కేంద్ర మాజీమంత్రి ఇ. అహ‍్మద్ మృతితో ఈ స్తానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
కాంగ్రెస్-యూడీఎఫ్ తరపున పి.కె.కన్హాలికుట్టి, సీపీఐ(ఎం) నుంచి ఎం.బి.ఫయాసల్(అధికార ఎల్‌డీఎఫ్), బీజేపీ మద్దతు ఇస్తున్న ఎన్.శ్రీప్రకాస్‌లు ప్రధాన అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. ఆరుగురు ఇండిపెండెంట్లు కూడా పోటీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
Advertisement
Advertisement