Malappuram by-poll
-
మలప్పురంలో ఎల్డీఎఫ్ దూకుడు..
మలప్పురం: కేరళ రాష్ట్రంలోని మలప్పురం లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక కౌంటింగ్లో కాంగ్రెస్-యూడీఎఫ్ తరపున బరిలోకి దిగిన పి.కె.కన్హాలికుట్టి ముందంజలో ఉన్నారు. కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచే కన్హాలికుట్టి ఆధిక్యం కొనసాగుతోంది. ఆయన 13వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండో స్థానంలో అధికార ఎల్డీఎఫ్ అభ్యర్థి ఎంబీ.ఫైజల్ ఉండగా, బీజేపీ మద్దతు ఇచ్చిన ఎన్.శ్రీప్రకాశ్ మూడోస్థానంలో కొనసాగుతున్నారు. మధ్యాహ్నం 11 గంటలకే రిజల్ట్స్ వెలువడనుంది. కాగా కేంద్ర మాజీమంత్రి ఇ. అహ్మద్ మృతితో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 12న జరిగిన ఉప ఎన్నికల్లో 71.33 శాతం పోలింగ్ నమోదు అయిన విషయం తెలిసిందే. మరోవైపు పినరయి విజయన్ అధికారం చేపట్టిన పది నెలల అనంతరం జరిగిన ఈ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా 2014 ఎన్నికల్లో అహ్మద్ 1.94 లక్షల మెజార్టీతో గెలుపొందారు. -
ఉప ఎన్నికలో 16 శాతం పోలింగ్
హైదరాబాద్: కేరళ రాష్ట్రంలోని మలప్పురం లోక్సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఉదయం 9 గంటల వరకు 16 శాతం పోలింగ్ నమోదైంది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లు ఫిర్యాదులు లేవని, కొన్నిచోట్ల ఈవీఎంలు తప్పుగా పనిచేయడంతో వాటిని సరిచేశామని అధికారులు తెలిపారు. కేంద్ర మాజీమంత్రి ఇ. అహ్మద్ మృతితో ఈ స్తానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్-యూడీఎఫ్ తరపున పి.కె.కన్హాలికుట్టి, సీపీఐ(ఎం) నుంచి ఎం.బి.ఫయాసల్(అధికార ఎల్డీఎఫ్), బీజేపీ మద్దతు ఇస్తున్న ఎన్.శ్రీప్రకాస్లు ప్రధాన అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. ఆరుగురు ఇండిపెండెంట్లు కూడా పోటీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.