కోల్‌కతా : ప్రచండ తుపాను ఫొని శుక్రవారం ఉదయం ఒడిశా తీరాన్ని తాకడంతో రానున్న 48 గంటల్లో ఎన్నికల ప్రచార ర్యాలీలను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రద్దు చేసుకున్నారు. బెంగాల్ తీర ప్రాంత జిల్లా మిడ్నపూర్‌లో పరిస్ధితిని క్షుణ్ణంగా పరిశీలించానలి ఆమె అధికారులను ఆదేశించారు. తుపాను నేపథ్యంలో రానున్న 48 గంటల్లో తన ర్యాలీలను రద్దు చేసకున్నానని, తాము నిత్యం తుపాన్ పరిస్ధితిని పరిశీలిస్తూ తగిన చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
ప్రజలంతా సహకరించాలని, రానున్న రెండు రోజులు ప్రభుత్వం అందించే సూచనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కాగా తీర ప్రాంత జిల్లాలు పశ్చిమ మిడ్నపూర్, దక్షిణ 24 పరగణాల జిల్లాలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. టూరిస్టులు సముద్రం ముందున్న వసతి గృహాల్లో బస చేయవద్దని, మత్స్యకారులు చేపలవేట కోసం సముద్రంలోకి వెళ్లరాదని కోరింది. పాఠశాలలు, విద్యాసంస్ధలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక కోల్‌కతాతో పాటు పశ్చిమ మిడ్నపూర్, ఉత్తర 24 పరగణాలు, హుగ్లీ, హౌరా జిల్లాల్లో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరింది. తీరప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment