
ప్రతీకాత్మక చిత్రం
ముంబై: యువతిపై ఉమ్మివేసి వికృత చర్యకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన మంగళవారం ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైలో మణిపురికి చెందిన యువతి ఏప్రిల్ 6న నిత్యావసరాలు తెచ్చుకునేందుకు గీతా విహార్ జంక్షన్ నుంచి కలీనా మిలటరీ క్యాంప్ వైపుగా వెళ్లింది. సరిగ్గా ఇదే సమయంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఓ యుకుడు బైక్ స్పీడు తగ్గించి ఆమెను సమీపించాడు. అనంతరం ఆమె దుస్తులపై ఉమ్మివేసి అక్కడ నుంచి పరారయ్యాడు. దీంతో కావాలని కరోనాను అంటించాలనే ఉద్దేశ్యంతోనే సదరు వ్యక్తి ఇలా చేసుంటాడని ఆ యువతి భయభ్రాంతులకు గురై పోలీసులను ఆశ్రయించింది. సీసీటీవీ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు సుమారు పది రోజుల తర్వాత నిందితుడిని పట్టుకున్నారు. అతడు పశ్చిమ ముంబైలోని కుర్లాలో నివసించే అమిర్‌ఖాన్‌గా గుర్తించారు. కాగా దేశంలో పలుచోట్ల ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. (ఎంత నమ్మకం ఉంటే ఇలా చేస్తారు!)
Comments
Please login to add a commentAdd a comment