సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్‌గా ఎదిగే క్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయడంతో కాంగ్రెస్ వర్గాల్లో ఉత్సాహం నెలకొంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆనంద్ శర్మ,షీలా దీక్షిత్, జ్యోతిరాదిత్య సింధియా వంటి సీనియర్ కాంగ్రెస్ నేతల సమక్షంలో రాహుల్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా రాహుల్‌పై మన్మోహన్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించారు.
కాంగ్రెస్ పార్టీ ఘన వారసత్వాన్ని, ఒరవడిని రాహుల్ ముందుకు తీసుకెళతారని విశ్వాసం వ్యక్తం చేశారు. రాహుల్‌ను డార్లింగ్ ఆఫ్ కాంగ్రెస్‌గా అభివర్ణించారు. కాంగ్రెస్ చీఫ్‌గా రాహుల్ ఎన్నో విజయాలు సాధించాలని పలువురు సీనియర్ నేతలు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వద్ద రాహుల్ నామినేషన్ వేస్తున్న సమయంలో పార్టీ రాష్ర్ట శాఖల చీఫ్‌లు, పీసీసీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment