సియాచిన్‌లో 41 మంది..
న్యూఢిల్లీ: సియాచిన్ గ్లేసియర్ విషాదంపై కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పార్లమెంటులో ఒక ప్రకటన చేశారు. సభ్యులు విశ్వంభర్ ప్రసాద్ నిషద్, కనకలతా సింగ్ రాజ్యసభలో అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. సైనికుల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.
సియాచిన్ పర్వత ప్రాంతంలో భారత సైన్యం అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా మానవరహిత ఏరియల్ వాహనాలు, వివిధ రకాల రాడార్లు తదితర ఆధునిక టెక్నాలజీని ఉపయెగిస్తున్నామన్నారు. ఇకముందు సరిహద్దులో భద్రతా కారణాలు, అక్కడి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అవసరమైన మేరకు సైనిక బలగాలను తరలిస్తామన్నారు. దీంతోపాటు తాజా ఘటన సహా, గత మూడేళ్లుగా సియాచిన్ పర్వత ప్రాంతాల్లో అమరులైన సైనికుల వివరాలు అందజేశారు. 2016 ఫిబ్రవరి 18 వరకు ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
2013 - 10
2014 - 8
2015 - 9
2016- 14
కాగా సియాచిన్ గ్లేసియర్‌లో సంభవించిన మంచుతుఫానులో చిక్కుకొని ఫిబ్రవరి 3న 10 మంది సైనికులు అసువులు బాసిన సంగతి తెలిసిందే.