చత్తీస్గఢ్లో ఈవీఎంలు ఎత్తుకెళ్లిన మావోయిస్టులు | Maoists abduct EVMs in Chhattisgarh | Sakshi
Sakshi News home page

చత్తీస్గఢ్లో ఈవీఎంలు ఎత్తుకెళ్లిన మావోయిస్టులు

Published Mon, Nov 11 2013 11:17 AM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM

చత్తీస్గఢ్లో ఈవీఎంలు ఎత్తుకెళ్లిన మావోయిస్టులు - Sakshi

చత్తీస్గఢ్లో ఈవీఎంలు ఎత్తుకెళ్లిన మావోయిస్టులు

చత్తీస్గఢ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా మావోయిస్టులు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. సోమవారం తొలి విడత పోలింగ్ ఆరంభం కాకముందే ఉదయం బాంబు పేలుడుకు ఓ జవాన్ తీవ్రంగా గాయపడగా, మావోయిస్టులు రెండు గ్రామాల్లో ఈవీఎంలను ఎత్తుకెళ్లారు. ఈ రెండు సంఘటనలు నక్సల్స్ ప్రాబల్యం ఎక్కువగా ఉండే బస్తర్ ప్రాంతం కాన్కర్ జిల్లాలో జరిగాయి.

పోలింగ్ ఆరంభమైన కాసేపటికి కాన్కర్ జిల్లాలోని సీతాపూర్, కోయిల్బెడా గ్రామాల్లో మావోయిస్టులు పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలను ఎత్తుకెళ్లారు. ఎన్నికల నిర్వహణకు భారీ భద్రత ఏర్పాట్లు చేసినా అక్కడక్కడ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలావుండగా పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement