గాయపడ్డ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి | CRPF jawan killed in Naxal ambush | Sakshi
Sakshi News home page

గాయపడ్డ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి

Published Mon, Nov 11 2013 5:08 PM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM

CRPF jawan killed in Naxal ambush

రాయ్పూర్:: పోలింగ్ స్టేషన్ పై మావోలు దాడి చేసిన ఘటనలో గాయపడిన సీఆర్పీఎఫ్ జవాను మృతి చెందాడు. మావోలు సోమవారం చత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లాలో ఓ పోలింగ్ స్టేషన్ పై దాడి చేయగా, దాన్ని ప్రతిఘటించిన జవాను తీవ్రంగా గాయపడి అనంతరం ప్రాణాలు కోల్పోయాడు. నయనార్ గ్రామంలో పోలింగ్ జరుగుతుండగా మావోయిస్టులు పేట్రేగిపోయారు. ఒక్క ఉదుటున దూసుకొచ్చిన మావోలు పోలింగ్ సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మృతి చెందిన జవాను186 బెటాలియన్ చెందినవాడని పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఇదిలా ఉండగా మావోయిస్టులు రెండు గ్రామాల్లో ఈవీఎంలను ఎత్తుకెళ్లారు. ఈ రెండు సంఘటనలు నక్సల్స్ ప్రాబల్యం ఎక్కువగా ఉండే బస్తర్ ప్రాంతం కాన్కర్ జిల్లాలో జరిగాయి.

చత్తీస్గఢ్, మావోయిస్టులు, ఈవీఎంలు, Chhattisgarh, Maoists, EVMs

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement