కేంద్రాపర: ఒడిశాలో 28 ఏళ్ల దళిత వివాహితను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. కేంద్రాపర జిల్లాలోని గతవారం ఆమెను అపహరించినట్టు పోలీస్ అధికారి నృసింగ చరన్ చెప్పారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దుండగులు తనను కిడ్నాప్ చేసిన అనంతరం పలు ప్రాంతాలకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్టు చెప్పింది. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారని బాధితురాలు వెల్లడించింది. పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసి వైద్య పరీక్షలకు తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వివాహిత కిడ్నాప్.. అత్యాచారం
Published Mon, Jul 14 2014 10:48 PM | Last Updated on Wed, Aug 29 2018 8:24 PM
Advertisement
Advertisement