సాక్షి, న్యూఢిల్లీ: దిశ అత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులపై దేశ వ్యాప్తంగా అభినందనలు వ్యక్తమవుతున్నాయి. నిందితులపై పోలీసులు సరైన రీతిలో వ్యవహరించారని, వారి సాహసాన్ని స్వాగతిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. పోలీసులు మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అత్యాచార నిందితులకు సరైన శిక్ష వేశారని కొనియాడారు. తెలంగాణ పోలీసులను చూసి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎంతో నేర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ పోలీసులు దేశ పోలీసు వ్యవస్థకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసలు కురిపించారు. మహిళలపై దాడులను అరికట్టాలంటే పోలీసు వ్యవస్థ ఇలాంటి చర్యలకు ఉపక్రమించక తప్పదని మాయావతి పేర్కొన్నారు.
కాగా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ హత్య కేసుపై అనేక వర్గాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయిన విషయం తెలిసిందే. దిశను అత్యంత దారుణంగా అత్యాచారం జరిపి, హత్య చేసిన కామాందులకు ఉరిశిక్ష పడాలని యావద్దేశం ముక్తకంఠంతో డిమాండ్ చేసింది. అయితే విచారణ నిమిత్తం శుక్రవారం తెల్లవారుజామున క్రైమ్ సీన్ రికన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చిచంపారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment