అమేథీలో బాలికపై అత్యాచారం.. హత్య | Minor girl raped, killed in Amethi | Sakshi
Sakshi News home page

అమేథీలో బాలికపై అత్యాచారం.. హత్య

Published Fri, Jun 27 2014 2:28 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

Minor girl raped, killed in Amethi

ఉత్తరప్రదేశ్లోని అమేథీ నియోజకవర్గ పరిధిలో తొమ్మిదేళ్ల బాలికపై గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి.. ఆమెను చంపేశారు. ఈ సంఘటన సంగ్రామ్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని రామ్గఢ్ గ్రామంలో జరిగింది. గత రాత్రి ఆమె కుటుంబ సభ్యులంతా బయటకు వెళ్లి, ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో కొంతమంది దుండగులు ఆమె ఇంట్లోకి వెళ్లి ఆమెను లాక్కెళ్లారు. బయటకు తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని అదనపు ఎస్పీ పి.మున్నాలాల్ తెలిపారు.

ముందుగా ఆమెపై అత్యాచారం చేసి, తర్వాత పీక పిసికి చంపేసినట్లు అదనపు ఎస్పీ చెప్పారు. బాధితురాలి నోట్లోను, ఇతర ప్రాంతాల్లోను రక్తపు మరకలు కనిపించాయని అమేథీ పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ మహ్మద్ హమీద్ తెలిపారు. ఉన్నతాధికారులంతా వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement