సాక్షి, న్యూఢిల్లీ : పాలకపక్ష భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన మే 23వ తేదీనే, ఓ మహిళతో సహా ముస్లింలను ఓ హిందువుల బృందం చితకబాదుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఆవు మాంసం కలిగి ఉన్నారన్న కారణంగా వారిని కొట్టడమే కాకుండా వారితో హిందూ నినాదాలు చేయించారు. ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే మధ్యప్రదేశ్‌లోని సియోనిలో ఈ సంఘటన జరిగిందని, ఇందులో ఐదుగురు అనుమానితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఫలితాలు వచ్చిన మూడు రోజుల అనంతరం బీహార్‌లోని బెగుసరాయ్‌లో సబ్బులు అమ్ముకునే మొహమ్మద్ ఖాసిం అనే వ్యక్తిని రాజీవ్ యాదవ్ అనే పాత నేరస్థుడు పిస్టల్‌తో కాల్చాడు. పేరేమిటని తనను అడిగాడని, పేరు చెప్పగానే పాకిస్థాన్ వెళ్లకుండా ఇక్కడెందుకున్నావంటూ కాల్చాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.
(హరియాణా, బిహార్‌ల్లో ముస్లింలపై దాడులు)
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ గతంలోకన్నా ఎక్కువ మెజారిటీ సీట్లలో అఖండ విజయం సాధించిన అనంతరం ముస్లింలపై, దళితులపై ఐదు దాడుల సంఘటనలు చోటు చేసుకున్నాయి. మే 26వ తేదీన మోదీ కొత్తగా ఎన్నికైన ఎన్డీయే పార్లమెంట్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘సబ్ కా విశ్వాస్’ నినాదంతో ముందుకు పోదాం అని సూచించారు. ‘మనకు ఓటు వేసిన వారు మన మిత్రులే, మనకు ఓటు వేయని వారు కూడా మిత్రులే’ అంటూ మైనారిటీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
దేశ ఆర్థికాభివద్ధి కోసం కషి చేయడం, దారిద్య్రాన్ని నిర్మూలించడం, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం, ఇతర సామాజిక సమస్యలను పరిష్కరించడం తమ ముందున్న ఎజెండాగా మోదీ చెప్పుకున్నారు. అందుకు ప్రతిబంధకాలైన సామాజక దాడులు తక్షణం ఆగిపోవాలి. మోదీ మొదటి విడత పాలనలా కాకుండా రెండో విడత పాలనంతా దేశాభివద్ధిపైనే కేంద్రీకతం కావాలని సామాజిక శాస్త్రవేత్తలు కోరుతున్నారు. మోదీ ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నారు.
ఇక మూక దాడులు ఆగిపోవాల్సిందే!
Published Thu, May 30 2019 5:44 PM | Last Updated on Thu, May 30 2019 5:48 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment