అమితాబ్ బచ్చన్ (ఫైల్) - ఏఆర్ రహ్మాన్
పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి మిత్రమా... అంటూ ఛాంబర్ ఆఫ్ సీక్రెట్స్‌లో లాక్‌హార్ట్, హ్యారీపోటర్‌కి చెబుతాడు. చివరకు లాక్‌హార్ట్ ద్రోహిగా తేలినా అతడు చెప్పిన మాట మాత్రం చరిత్రలో నిలిచిపోయే సత్యం.
ట్విటర్ 2018లో అత్యంత ప్రభావశీలురుగా నిలిచిన వారి పేర్లను బ్రాండ్‌వాచ్ వారు తాజాగా ప్రకటించారు. ట్విటర్ అకౌంటు పురుషులదో మహిళలదో తెలుసుకోవడానికి డేటాబేస్‌ను నిశితంగా పరిశీలించారు. ప్రత్యేక అల్గారిథాన్ని ఉపయోగించి ట్విటర్ యూజర్లను పలు అంశాలలో లోతైన విశ్లేషణ చేశారు. ట్విటర్‌లో వారు గడిపిన సమయాన్ని, ఫాలోవర్లు చేసిన కాంమెంట్లు, రీట్వీట్ల ఆధారంగా వారికి మార్కులను నిర్ణయించారు. ఈ జాబితాలో బిగ్ బీ, ప్రముఖ సంగీతదర్శకుడు రెహ్మాన్ టాప్ టెన్‌లో ప్టేస కొట్టేసారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఎనిమిదో స్థానంలో నిలవగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహ్మాన్ పదవ స్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన ప్రముఖ సింగర్ లియామ్ జేమ్స్ పైన్ మొదటి స్థానంలో నిలవగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో స్ధానాన్ని నిలబెట్టుకున్నారు. గత సంవత్సరం ప్రధమ స్థానంలో ఉన్న జస్టిన్ బైబర్ రెండు స్థానాలు దిగజారి మూడో స్థానానికి చేరుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నాలుగో స్థానంలో, ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డొ అయిదో స్థానం సాధించారు.
ప్రభావశీలురుగా నిలిచిన మహిళలలో టేలర్ స్విఫ్ట్ ప్రధమ స్థానంలో నిలిచారు. గత సంవత్సరం ప్రధమ స్థానంలో ఉన్న కేటీ పెర్రీ రెండో స్థానానికి దిగజారారు. సెలీనా గోమెజ్ ఆరో స్థానంలో, షకీరా ఏడో స్థానంలో, జెన్నిఫర్ లోపేజ్ ఎనిమిదో స్థానంలో నిలిచారు. పురుషులతో పోలిస్తే మహిళలకే ఎక్కువ మార్కులు రావడం విశేషం. జస్టిన్ బీబర్ ట్విటర్‌ను ఎక్కువగా ఉపయోగించక పోయినప్పటికీ స్థానం సంపాదించారు. పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ సింగర్స్ ఎక్కువ స్థానాలు సాధించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment