మూడేళ్ల కొడుకును తల నరికి మరీ చంపిన ఓ తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. అంతిమా జైన్ అనే ఆ మహిళ.. తన కొడుకు దుకాణానికి వెళ్తానని మారాం చేస్తుంటే వద్దని మందలించింది. తర్వాత ఏమైందో తెలియదు గానీ, పొరుగునున్న సంజయ్ శర్మ జైన్ అనే వ్యక్తి ఆవుకు మేత పెట్టడానికి వెళ్లి చూస్తే, అక్కడ పిల్లాడి శవం కనిపించింది.
సంఘటన స్థలంలో ఓ కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. రక్తపు మడుగు, అక్కడ లభించిన ఇతర ఆధారాలను బట్టి ముందుగా కుటుంబ సభ్యులందరినీ విచారించారు. తొలుత రకరకాలుగా తనకు తెలియదని చెప్పినా, తర్వాత మాత్రం అంతిమా జైన్ తన నేరాన్ని అంగీకరించింది. దాంతో ఆమెను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
మూడేళ్ల కొడుకును తలనరికి చంపిన తల్లి
Published Sat, Jul 12 2014 2:34 PM | Last Updated on Tue, Aug 28 2018 7:09 PM
Advertisement
Advertisement