
ప్రధానిని కలిసి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి వారసులు
సాక్షి, న్యూఢిల్లీ : అమరగాయకురాలు భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి మనుమరాళ్లు ఐశ్వర్య, సౌందర్య బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు.. 1966లో ఎం.ఎస్. సుబ్బులక్ష్మిఐక్యరాజ్య సమితిలో పాడిన మైత్రీమ్ భజతామ్ గీతాన్ని మోదీ ముందు ఆలపించారు. ఈ గీతాన్ని కంచి కామకోటి పీఠాధిపతులైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు రచించారు. సౌందర్య, ఐశ్వర్యలతో పాటు.. వారి తల్లిదండ్రులు శ్రీనివాసన్, గీతలు కూడా మోదీని కలిసినవారిలో ఉన్నారు.