‘ముంబై’ పీఠంపై శివసేన!
ముంబై: బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్, ఉపమేయర్ పదవులకు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు బీజేపీ ప్రకటించింది. అంతకు కొద్దిసేపటి ముందే శివసేన తన మేయర్, ఉప మేయర్ అభ్యర్థులుగా వరసగా విశ్వనాథ్ మహదేశ్వర్, హరేశ్వర్ వోర్లికర్‌లను ఖరారు చేసింది.
దీంతో మార్చి 8న జరిగే బీఎంసీ తొలి సమావేశంలో వీరి ఎన్నిక లాంఛనం కానుంది. బరి నుంచి తప్పుకోవడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ తమకు తగినంత సంఖ్యా బలం లేకపోవడంతో అధికారం కోసం పోటీ పడకూడదని నిర్ణయించుకున్నామనీ, బీఎంసీకి కాపలాదారుగా (వాచ్ డాగ్) వ్యవహరిస్తామని అన్నారు.