Brhan Mumbai Municipal Corporation
-
‘ముంబై’ పీఠంపై శివసేన!
ముంబై: బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్, ఉపమేయర్ పదవులకు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు బీజేపీ ప్రకటించింది. అంతకు కొద్దిసేపటి ముందే శివసేన తన మేయర్, ఉప మేయర్ అభ్యర్థులుగా వరసగా విశ్వనాథ్ మహదేశ్వర్, హరేశ్వర్ వోర్లికర్లను ఖరారు చేసింది. దీంతో మార్చి 8న జరిగే బీఎంసీ తొలి సమావేశంలో వీరి ఎన్నిక లాంఛనం కానుంది. బరి నుంచి తప్పుకోవడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ తమకు తగినంత సంఖ్యా బలం లేకపోవడంతో అధికారం కోసం పోటీ పడకూడదని నిర్ణయించుకున్నామనీ, బీఎంసీకి కాపలాదారుగా (వాచ్ డాగ్) వ్యవహరిస్తామని అన్నారు. -
ట్యాబ్ల పంపిణీకి ఓకే
- అంగీకరించిననగర పాలక సంస్థ - అనవసర ఖర్చంటున్న విపక్షాలు - విద్యార్థులు చదువుకోడానికే అంటున్న బీఎంసీ ముంబై: నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసేందుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అంగీకరించింది. ప్రతిపాదనను బీఎంసీ స్టాండింగ్ కమిటీ బుధవారం ఆమోదించింది. అయితే ఇది అనవసరమైన ఖర్చని.. వైఫై, 3జీ సేవలు లేకుండా ట్యాబ్లు ఎలా పనిచేస్తాయని ఇతర పార్టీలు వ్యతిరేకించాయి. ‘ ఇంటర్నెట్ లేకుండా ట్యాబ్లెట్ పంపిణీ చేయడం నిజంగా హాస్యాస్పదం. ట్యాబ్లెట్లు పంపిణీ చేస్తామంటూ శివసేన నిధుల్ని వృథా చేస్తోంది. ముంబైని వైఫై నగరంగా తీర్చి దిద్దాలనుకుంటున్న సేన విద్యార్థులు చదువుకుంటున్న మున్సిపల్ పాఠశాలల్లో ఎందుకు ఆ సదుపాయం కల్పించడంలేదు’ అని బీఎంసీలో ఎంఎన్ఎస్ నాయకుడు సందీప్ దేశ్పాండే ప్రశ్నించారు. యువసేన నాయకుడు ఆదిత్య ఠాక్రే గత వారం ప్రధాని మోదీని కలసి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ, డిజిటల్ ఇండియా ప్రచారానికి అది ఎలా ఉపయోగపడతుందన్న విషయాన్ని వివరించారు. సిలబస్, నోట్స్ కలిగిన ట్యాబ్లు విద్యార్థులు చదువుకోడానికి ఎంతో ఉపకరిస్తాయని, వారికి పుస్తకాల భారం కూడా తగ్గిస్తాయని ఠాక్రే, ఇతర శివసేన ఎంపీలు చెప్పారు. మరోవైపు ప్రాజెక్టును వెంటనే నిలిపేయాలని, పరిష్కరించాల్సిన సమస్యలు ఇంకా చాలా ఉన్నాయని ఎన్సీపీ ముంబై అధ్యక్షుడు సచిన్ ఆహిర్ అన్నారు. వర్షాకాలంలో బీఎంసీ పాఠశాలల్లోకి నీరు చేరుతోందన్నారు. ట్యాబ్లు ఉపయోగించుకోడానికి వారికి సరైన అవగాహన లేదన్నారు. బీఎంసీ ఈ విధంగా ధన్నాన్ని ఎందుకు వృథా చేస్తోందో తనకు అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. అయితే బీఎంసీ మాత్రం భిన్న వాదనలు వినిపిస్తోంది. -
లీకేజీలపై బీఎంసీ దృష్టి
సాక్షి, ముంబై: భూగర్భంలో నీటిపైపుల లీకేజీని గుర్తించే అత్యాధునిక యంత్రాలు కొనుగోలు చేయాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) యోచిస్తోంది. ఈ యంత్రాలు అందుబాటులోకి వస్తే భూమిలో కలసిపోతున్న లక్షల లీటర్ల తాగు నీరు ఆదా కానుంది. నగర రహదారుల కింద ఏర్పాటుచేసిన నీటి పైపులు బ్రిటిష్ కాలంలో వేసినవే. తరచూ మరమ్మతులు చేపడుతున్నా రోజూ ఎక్కడో ఒకచోట లీకేజీ అవుతూనే ఉంది. దీంతో లక్షల లీటర్ల నీరు వృథా అవుతోంది. ఇలా లీకైన నీరు భూమిలో ఇంకిపోవడంవల్ల తరచూ భూమి కుంగిపోవడం లాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. భూగర్భంలో అవి ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి..? వాటి వాల్వులు ఎక్కడెక్కడున్నాయో ఇప్పటి ఇంజనీర్లకు స్పష్టంగా తెలియదు. లీకేజీ గుర్తించడానికి బీఎంసీ పరిపాల నా విభాగం వద్ద ఆధునిక యంత్ర పరికరాలు లేవు. భూమిని తవ్వితే తప్ప లీకేజీలు బయటపడటంలేదు. భూమిని తవ్వడమంటే అది వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం..దాంతోపాటు ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. దీంతో లీకేజీని గుర్తించడమంటే బీఎంసీ నీటి సరఫరా శాఖ ఇంజనీర్లకు తలప్రాణం తోకకు వస్తోంది. నీటి లీకేజీని గుర్తించేందుకు లీక్ డిటెక్షన్ మెషిన్, పైప్లైన్ లొకేటర్, వాల్వ్ లొకేటర్, డిజిటల్ సౌండ్ స్టిక్ యంత్రాలున్నాయని అధికారులు తెలిపారు. వీటిని కొనుగోలు చేయడానికి దాదాపు రూ.40 లక్షల వరకు ఖర్చవుతాయని నీటి సరఫరా శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. వీటి సాయంతో భూగర్భంలో జరుగుతున్న లీకేజీని వెంటనే అరికట్టవచ్చని వివరించారు.