‘టెన్షన్.. హరియాణా.. ఢిల్లీలో అలర్ట్’
పంజాబ్: పంజాబ్‌లో ఖలీస్థాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ హర్మిందర్ సింగ్ అలియాస్ మింటూతోపాటు నలుగురు తప్పించుకున్న నేపథ్యంలో పంజాబ్ జైళ్ల శాఖ డీజీపై సస్పెన్షన్ వేటు పడింది. అనంతరం పంజాబ్‌లో హై అలర్ట్ విధించారు. పోలీసులు అప్రమత్తమయ్యారు.
జైలు నుంచి సుమారు 50 కిలో మీటర్ల దూరంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఖైదీల పరారీ నేపథ్యంలో ఢిల్లీ, హరియాణాలోనూ హై అలర్ట్ విధించారు. పంజాబ్‌లో ఆదివారం ఉదయం పోలీసు దుస్తుల్లో వచ్చిన సాయుధులు జైలుపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. పంజాబ్‌లోని నభా జైలుపై 10మంది సాయుధులు దాడి చేసి.. ఖలీస్థాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ హర్మిందర్ సింగ్ అలియాస్ మింటూతోపాటు మరో నలుగురిని విడిపించుకొని తీసుకెళ్లారు. మింటూతోపాటు పరారైన నలుగురు కూడా గ్యాంగ్‌స్టర్లే కావడం గమనార్హం.