కఠిన చర్యలు తీసుకుంటాం: డిప్యూటీ సీఎం
కఠిన చర్యలు తీసుకుంటాం: డిప్యూటీ సీఎం
Published Sun, Nov 27 2016 2:46 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM
అమృత్‌సర్: నభా జైలుపై సాయుధులు దాడి చేసి.. ఖలీస్థాన్ ఉగ్రవాది హర్మిందర్ సింగ్ మింటూను విడిపించుకొని వెళ్లిన ఘటనతో పంజాబ్లో హైఅలర్ట్ ప్రకటించారు. మింటూతో పాటు మరో నలుగురు క్రిమినల్స్ సైతం జైలు నుంచి పారిపోయిన ఈ ఘటనను ఆ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వీరిని పట్టుకునేందుకు స్పెషల్ టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ, హరియాణాల్లో సైతం అధికారులు అప్రమత్తమయ్యారు.
జైలుపై దాడి, నేరస్తుల పరారీ ఘటనపై ఏడీజీపీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని బాదల్ తెలిపారు. జైళ్ల శాఖ డీజీని సస్పెండ్ చేసినట్లు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తెలిపారు.
Advertisement