మోడీ.. ఆత్రంతో ఉన్న వరుడు!
సింధుదుర్గ్: ఎన్‌సీపీ అధినేత, కేంద్ర మంత్రి శరద్‌పవార్ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై వ్యంగాస్త్రాలు విసిరారు. మోడీని ఆత్రంతో ఉన్న ఓ పెళ్లికొడుకుతో పోల్చారు. వరుడు పెళ్లి చేసుకోవడానికి తొందరపడినట్లే... మోడీ కూడా ప్రధాని కావాలని చాలా ఆత్రంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో ఎన్నికల సభలో ఆదివారం పవార్ పాల్గొని మాట్లాడారు. గుజరాత్ అభివృద్ధి విషయంలో మోడీ చెబుతున్న దాన్ని తక్కువ చేస్తూ... ఆయన కంటే ముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రులే బాగా పనిచేశారని కొనియాడారు.