సైనికాధికారులతో మోడీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అత్యున్నత సైనికాధికారులతో సమావేశమయ్యారు. శుక్రవారం రక్షణ శాఖ వార్ రూమ్లో ఈ భేటీ జరిగింది. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న పరిస్థితుల్లో మోడీ సైన్యాధికారులతో సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించాక సైనిక దళాల ప్రధానాధికారులతో మొదటిసారి సమావేశమయ్యారు. త్రివిద దళాధిపతులు దేశ రక్షణకు సంబంధించి మోడీకి నివేదిక సమర్పించనున్నారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ, హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి సు
ష్మా స్వరాజ్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, త్రివిద దళాల అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రహ, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ కే ధోవన్, ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ పాల్గొన్నారు.