'నరేంద్ర మోడీని పాకిస్థాన్ కు పంపించాలి'
పాట్నా: బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి నిప్పులు చెరిగారు. మోడీని పాకిస్థాన్ పంపివేయాలని లాలూ అన్నారు.
ప్రతిపక్షనేతలకు భారత దేశంలో స్థానం లేదని..వారిని ఇరుపొరుగు రాష్ట్రాలకు పంపివేయాలని మోడీ చేసి వ్యాఖ్యలపై లాలూ స్పందిస్తూ.. ఆయననే ముందు పాకిస్థాన్ పంపిచాలన్నారు.
2002 గుజరాత్ మత ఘర్షణలకు కారణమైన నరేంద్రమోడీ ఓ తలారీ, కసాయి అని లాలూ వ్యాఖ్యానించారు. మోడీ మాతో పోరాడేంత శక్తి లేదని.. ఆయనను చూసి కసాయిలే సిగ్గుపడుతున్నారని లాలూ ఎద్దేవా చేశారు.