కాంగ్రెస్, ఎన్సీపీలు ఏం చేశాయి?
ముంబై: ప్రధాని నరేంద్ర మోడీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. శనివారం బీడ్లో జరిగిన ఎన్నికల ప్రచారం సభలో మోడీ పాల్గొన్నారు. మోడీ ఈ సందర్భంగా బీజేపీ దివంగత నేత గోపీనాథ్ ముండేతో అనుబంధాన్ని, ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
మహారాష్ట్రలో మొన్నటిదాకా అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీలపై మోడీ విమర్శలు ఎక్కుపెట్టారు. 15 ఏళ్ల పాలనలో కాంగ్రెస్, ఎన్సీపీలు ప్రజలకు ఏం చేశాయని ప్రశ్నించారు. మహారాష్ట్ర ప్రజల కోసం ఈ రెండు పార్టీలు చేసిందేమీ లేదని మోడీ విమర్శించారు.