10న కేంద్ర మంత్రివర్గ విస్తరణ?
న్యూఢిల్లీ: కేంద్రమంత్రివర్గాన్ని ప్రధాని నరేంద్రమోడీ విస్తరిస్తున్నారనే వార్తలు దేశ రాజధానిలో జోరందుకున్నాయి. కేంద్రమంత్రి వర్గ విస్తరణపై చర్చించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ప్రధాని మోడీ కలవనున్నారు. వచ్చే సోమవారం మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
మనోహర్ పారికర్ తోపాటు, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన జాట్ వర్గానికి చెందిన బిరేంద్ర సింగ్, మహారాష్ట్ర నుంచి హన్స్ రాజ్ ఆహిర్, బీహార్ కు చెందిన గిరిరాజ్ సింగ్, యశ్వంత్ సిన్హా కూతురు జయంత్ సిన్ఫాలకు కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకునే కనిపిస్తోంది.
ఇప్పటికే మనోహర్ పారికర్ కు కేంద్ర రక్షణ శాఖ కట్టబెడుతున్నారంటూ వార్తలు బుధవారం మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.