హొసూరు: సాధారణ గృహిణులు ఏకంగా దేశ ప్రధానితో సంభాషించే భాగ్యాన్ని పొందారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన ఉజ్వల్ పథకం ద్వారా ఉచిత వంటగ్యాస్ ఉపయోగంపై సోమవారం సూళగిరి తాలూక మేలుమలై గ్రామస్థులతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇంతవరకు క్రిష్ణగిరి జిల్లాలో 8714 మంది లబ్దిదారులకు ఈ వంట గ్యాస్‌లను పంపిణీ చేశారు. వంటగ్యాస్ ఉపయోగంపై జిల్లా కేంద్రం క్రిష్ణగిరి కలెక్టర్ కార్యాలయంలో ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్ధిదారులను అడిగి తెలుసుకొన్నారు.
సంభాషణ ఇలా...
♦ ఈ వీడియో కాన్పిరెన్స్‌లో లబ్దిదారులు సూళగిరి తాలూకా మేలుమలై గ్రామానికి చెందిన రుద్రమ్మ, ఈశ్వరి, లక్ష్మిలు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ నమస్కారం తమిళనాడు. ఉచిత వంటగ్యాస్ ఉపయోగం ఎలా ఉంది అని అడిగారు.
♦ అందుకు మహిళలు ఇంతవరకు తాము వంట చెరకుతో వంట చేసేవారమని, ప్రధాని ఉజ్వల్ పథకం ద్వారా ఉచిత వంటగ్యాస్‌లు అందుకోవడం తమకు సద్వినియోగంగా ఉందన్నారు.
♦ తమిళనాడులో ఇడ్లీ, దోసె తదితర ఆహార పదార్థాలు ప్రత్యేకత అని, తాను మీ ఇంటికొస్తే ఇడ్లీ, దోసె వండిపెడతారా అని లబ్దిదారులను ప్రధాని అడిగారు.
♦ ఈ కార్యక్రమంలో కలెక్టర్ సి. కదిరవన్, ఇండియన్ ఆయిల్ నిర్వహణ మండల మేనేజర్ సునిల్, అధికార్లు కుమరేషన్, సాధిక్, సుశీలరాణి, మహేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment