Ujwala LPG scheme
-
ఎన్నికల వేళ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఏపీ, టీఎస్ మధ్య..
సాక్షి, ఢిల్లీ: దేశంలో త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆసక్తికర నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక, బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ భేటీ అనంతరం కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి మీడియాకు కేటినెట్ నిర్ణయాలకు వెల్లడించారు. కేబినెట్ నిర్ణయాలు ఇవే.. ►ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని KWDT-2ట్రిబ్యునల్ కు కేంద్రం ఆదేశం. ప్రాజెక్ట్‌ల వారీగా నీటిని కేటాయించాలని ఆదేశం. ► ఉజ్వల గ్యాస్ సిలిండర్లపై మరో రూ.100 సబ్సిడీకి ఆమోదం. ► సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీ ఏర్పాటుకు ఆమోదం. రూ.889 కోట్లో వర్సిటీ ఏర్పాటు. ► తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు ఆమోదం. The government has raised subsidy amount for Pradhan Mantri Ujjwala Yojana beneficiaries from Rs 200 to Rs 300 per LPG cylinder: Union minister Anurag Thakur during a briefing on Cabinet decisions pic.twitter.com/Dvf7wXtXQT — ANI (@ANI) October 4, 2023 ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు సంబంధించిన మూడు అంశాలను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. పసుపు బోర్డు, ములుగులో గిరిజన యూనివర్సిటీ, కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు జరుగుతుంది. పసుపు బోర్డు కోసం రైతులు ఎన్నో ఏళ్లుగా ఆందోళన చేస్తున్నారు. జాతీయ పసుపు బోర్డు కోసం రైతులు చాలా రోజులుగా పోరాటం చేశారు. ఈరోజు జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 12 లక్షల టన్నుల పసుపు ఉత్పత్తి మన దేశంలో జరుగుతోంది అని అన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నదీ జలాలపై పరిష్కారం చేశాం. విభజన చట్టం సెక్షన్-89కి లోబడే ఈ నిర్ణయం తీసుకున్నాం. ట్రిబ్యునల్ ప్రాజెక్ట్‌లవారీగా నీటి కేటాయింపులను చేస్తుంది. సొలిసిటర్ జనరల్ సూచనలతో కేంద్రం చర్యలు తీసుకుంది. ఉమ్మడి రాష్ట్రానికి గతంలో 800 టీఎంసీలు కేటాయించారు. 2013లో ట్రిబ్యునల్ రిపోర్టు వచ్చినా, గెజిట్ కాలేదు. 2015లో తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ వేసింది. తాజాగా నదీ జలాల అంశం పరిష్కారం కానుంది అని అన్నారు. దాదాపు 900 కోట్ల రూపాయలతో ములుగులో సమ్మక్క సారక్క సెంట్రల్ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం చేస్తాం. తెలంగాణ గిరిజనుల్లో 40 శాతం మాత్రమే అక్షరాస్యత ఉంది. గిరిజనుల బాగు కోసమే ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలపై పరిశోధన జరుగుతుంది. Government of India has notified the establishment of the National Turmeric Board. This Board will help increase awareness and consumption of turmeric and develop new markets internationally to increase exports. — ANI (@ANI) October 4, 2023 -
మీ ఇంటికొస్తా, ఇడ్లీ, దోసె పెడతారా?
హొసూరు: సాధారణ గృహిణులు ఏకంగా దేశ ప్రధానితో సంభాషించే భాగ్యాన్ని పొందారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన ఉజ్వల్ పథకం ద్వారా ఉచిత వంటగ్యాస్ ఉపయోగంపై సోమవారం సూళగిరి తాలూక మేలుమలై గ్రామస్థులతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇంతవరకు క్రిష్ణగిరి జిల్లాలో 8714 మంది లబ్దిదారులకు ఈ వంట గ్యాస్‌లను పంపిణీ చేశారు. వంటగ్యాస్ ఉపయోగంపై జిల్లా కేంద్రం క్రిష్ణగిరి కలెక్టర్ కార్యాలయంలో ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్ధిదారులను అడిగి తెలుసుకొన్నారు. సంభాషణ ఇలా... ♦ ఈ వీడియో కాన్పిరెన్స్‌లో లబ్దిదారులు సూళగిరి తాలూకా మేలుమలై గ్రామానికి చెందిన రుద్రమ్మ, ఈశ్వరి, లక్ష్మిలు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ నమస్కారం తమిళనాడు. ఉచిత వంటగ్యాస్ ఉపయోగం ఎలా ఉంది అని అడిగారు. ♦ అందుకు మహిళలు ఇంతవరకు తాము వంట చెరకుతో వంట చేసేవారమని, ప్రధాని ఉజ్వల్ పథకం ద్వారా ఉచిత వంటగ్యాస్లు అందుకోవడం తమకు సద్వినియోగంగా ఉందన్నారు. ♦ తమిళనాడులో ఇడ్లీ, దోసె తదితర ఆహార పదార్థాలు ప్రత్యేకత అని, తాను మీ ఇంటికొస్తే ఇడ్లీ, దోసె వండిపెడతారా అని లబ్దిదారులను ప్రధాని అడిగారు. ♦ ఈ కార్యక్రమంలో కలెక్టర్ సి. కదిరవన్, ఇండియన్ ఆయిల్ నిర్వహణ మండల మేనేజర్ సునిల్, అధికార్లు కుమరేషన్, సాధిక్, సుశీలరాణి, మహేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఉజ్వలా’ @ 2.5 కోట్లు
న్యూఢిల్లీ: పేద మహిళలకు ఉచిత వంటగ్యాస్ అందించే ఉద్దేశంతో గతేడాది మేలో కేంద్రం ప్రారంభించిన ఉజ్వలా ఎల్పీజీ పథకం 2.5 కోట్ల మందికి చేరువైంది. బెంగాల్‌కు చెందిన ఓ మహిళకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం ఇచ్చిన కనెక్షన్‌తో లబ్ధిదా లరు సంఖ్య రెండున్నర కోటికి చేరింది. పథకం విజయవంతం అవ్వడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విటర్లో హర్షం వ్యక్తం చేశారు. పథకాన్ని ప్రారంభించినప్పుడు మూడేళ్లలో ఐదు కోట్ల మంది లబ్ధిదారులకు చేరువవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామనీ, 14 నెలల్లోనే సగం లక్ష్యాన్ని చేరుకోవడం సంతోషాన్నిస్తోందని మోదీ అన్నారు. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఆయన అభినందనలు తెలిపారు.