‘ఉజ్వలా’ @ 2.5 కోట్లు
న్యూఢిల్లీ: పేద మహిళలకు ఉచిత వంటగ్యాస్ అందించే ఉద్దేశంతో గతేడాది మేలో కేంద్రం ప్రారంభించిన ఉజ్వలా ఎల్‌పీజీ పథకం 2.5 కోట్ల మందికి చేరువైంది. బెంగాల్‌కు చెందిన ఓ మహిళకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం ఇచ్చిన కనెక్షన్‌తో లబ్ధిదా లరు సంఖ్య రెండున్నర కోటికి చేరింది.
పథకం విజయవంతం అవ్వడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విటర్‌లో హర్షం వ్యక్తం చేశారు. పథకాన్ని ప్రారంభించినప్పుడు మూడేళ్లలో ఐదు కోట్ల మంది లబ్ధిదారులకు చేరువవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామనీ, 14 నెలల్లోనే సగం లక్ష్యాన్ని చేరుకోవడం సంతోషాన్నిస్తోందని మోదీ అన్నారు. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఆయన అభినందనలు తెలిపారు.